టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ''భరత్ అనే నేను'' సినిమా ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో మహేష్‌కు మంచి మార్కెట్ ఉంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఫ్లాప్ సినిమాలు కూడా అక్కడ మిలియన్ డాలర్ల వసూళ్లు కురిపిస్తాయి.