టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ''భరత్ అనే నేను'' సినిమా ఏప్రిల్ 20వ తేదీన విడుదల కానుంది. సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే దిశగా.. ఈ సినిమాకు చెందిన పాట లిరిక్స్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు.
ఈ నెల 7వ తేదీన మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ఆడియో ఫంక్షన్ జరుగనుంది. ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, చరణ్ హాజరవుతారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంకేముంది..? తాజాగా విడుదలైన ''వచ్చాడయ్యో సామి'' పాట లిరిక్స్‌ను ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి.