సామ్రాట్ ప్రేమ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన పూజ... కౌషల్‌కు ప్రపోజ్ చేసిన గీత

శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:23 IST)
బిగ్‌బాస్‌లో పెళ్లి వేడుకలు వివాదాలు లేకుండా సరదాగా ముగిశాయి. దీంతో ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు, ఈ వేడుకను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు గానూ సభ్యులకు 2000 లగ్జరీ పాయింట్స్ లభించాయి. సీక్రెట్ టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసిన సామ్రాట్, రోల్ రైడాలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మంచి బహుమతులను అందజేసారు బిగ్ బాస్. 
 
కుటుంబసభ్యుల ఫోటోలు చూసి ఎంతో ఉద్యేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు ఇద్దరూ. సామ్రాట్ కెమెరా ముందుకొచ్చి లారా అనే పిల్లిని చిన్నప్పుడే దత్తత తీసుకున్నానని, దానిని చాలా మిస్ అవుతున్నానని, ఇప్పుడు అది పెద్దదైపోయుంటుందని కంటతడి పెట్టుకున్నారు.. అంతేకాకుండా తన  తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. 
 
అంతలోనే ఇంట్లోని యాక్టివిటీ రూమ్‌లోకి ప్రవేశించిన నీవెవరివి చిత్ర హీరో, హీరోయిన్లు ఆది పినిశెట్టి, రితిక, తాప్సీ పన్ను సభ్యులందరినీ అక్కడికి పిలిచి వారితో ముచ్చటించి వివిధ టాస్కులతో హంగామా చేసారు. ఈ టాస్క్‌లలో భాగంగా సామ్రాట్‌ను మరోసారి పూజకు ప్రపోజ్ చేయమని కోరారు. ముందురోజు ఒప్పుకోని పూజ సామ్రాట్ మాటలకు పడిపోయి ఈసారి యాక్సెప్ట్ చేసేసింది.
 
ఇక కౌషల్‌ను బిగ్ బాస్‌గా నటించమని, బిగ్ బాస్ గర్ల్ ఫ్రెండ్‌గా గీతను అతనికి స్వీట్‌గా మాట్లాడటం నేర్పించమని చెప్పారు. మొత్తానికి హుషారైన టాస్క్‌లతో సందడి సందడిగా గడిచిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు