PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

డీవీ

సోమవారం, 20 జనవరి 2025 (09:20 IST)
Helth camp poster
దివంగత కృష్ణంరాజు జయంతిని ప్రతి ఏటా జనవరి 20వ తేదీన జరుపుకుంటారు. ఆయన జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేడు జనవరి 20 సోమవారంనాడు భారీ ఎత్తున భీమవరంలో హెల్త్ క్యాంప్ ను నిర్వహిస్తున్నారు. యు.కె. ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రముఖ డాక్టర్లు, రాజకీయనాయకులు సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. క్రిష్ణంరాజుగారి భార్య ఉప్పల పాటి శ్యామలాదేవి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ వేడుకలో క్రిష్ణంరాజు కుమార్తెలు హాజరవుతున్నారు.
 
కాగా, ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు భీమవరంలో ప్రచారం జరుగుతోంది. వచ్చినా ఆయన కాసేపు వుండి వెంటనే వెళ్ళిపోతారని సమాచారం. హైదరాబాద్ లో ఫిలింసిటీలో రేపటినుంచి మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న రాజాసాబ్ షూటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. కనుక ఆయన భీమవరం రానున్నట్లు తెలుస్తోంది. క్రిష్ణంరాజు కుటుంబానికి ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో, పట్టణాల్లో మంచి పేరుంది. కేంద్ర మంత్రిగా కూడా వున్నారు. క్రిష్ణంరాజు స్వయంగా కామెర్లకు మందు కూడా వేసేవారు. కామెర్ల డాక్టర్ అని ఆయన్ను పిలుస్తుండేవారు. అందుకే భీమవరం చుట్టు పక్కల వారికి వైద్యసేవలు అందించేందుకు శ్యామాలాదేవి గారు నిర్ణయించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు