మహిళలు ఆల్కహాల్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. రొమ్ము క్యాన్సర్ అనేది.. ఆల్కహాల్‌ను కొంత మొత్తంలోనైనా తీసుకునే మహిళల్లో 5 నుంచి 11శాతం వరకు వచ్చే ప్రమాదం వుందని యూకే క్యాన్సర్ పరిశోధన కేంద్రం అధ్యయనంలో తేల్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ ఏర్పడటానికి కారణాలేంటో తెలియజేసేందుకు యూకే క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం చేపట్టింది.
మద్యాన్ని తీసుకోవడాన్ని తగ్గించుకుంటే.. మహిళల్లో క్యాన్సర్ సోకే అవకాశాలు చాలామటుకు తగ్గించుకోవచ్చునని అధ్యయనంలో తేల్చింది. 200 మంది మహిళలపై జరిగిన ఈ అధ్యయనాన్ని బీఎమ్‌జే ఓపెన్ ఆన్‌లైన్ జర్నల్ ప్రచురించింది. అలాగే రొమ్ము క్యాన్సర్ ముప్పు బరువు పెరగడం, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా తప్పదని.. ఇందులోనూ డార్క్ ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం ఇబ్బంది తప్పదని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.
యూకేలో బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించే వారి సంఖ్య ఎక్కువని వంద మందిలో ఎనిమిది మంది మహిళలను రొమ్ము క్యాన్సర్ వేధిస్తుంటుందని.. ఇందుకు మద్యం సేవించడమే కారణమని అధ్యయనంలో తేలింది. దాదాపు అర్థ మిలియన్ మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలతో క్లినిక్స్ వెంట తిరుగుతున్నారని వెల్లడి అయ్యింది. అందుకే మహిళలు ఆల్కహాల్‌కు దూరంగా వుండాలని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.