బరువు గురించి మాట్లాడుతారా? స్మృతి ఇరానీ సూపర్ ఆన్సర్.. (ఫోటోలు)

బుధవారం, 12 జూన్ 2019 (13:16 IST)
భారత దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల గురించి ప్రపంచ దేశాలన్నీ చర్చించుకున్నాయి. ఈ ఎన్నికల్లో యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ భారీ మెజార్టీ ఓడించి.. గెలుపును నమోదు చేసుకున్నారు. తద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల తన ట్విట్టర్ పేజీలో ఓ ఫోటోను స్మృతి ఇరానీ ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో తన పాత ఫోటోను, ప్రస్తుత ఫోటోను పోస్టు చేశారు. ఈ ఫోటోలకు క్యాప్షన్‌గా ''ఏం జరిగిందో చూడండి'' అంటూ కామెంట్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా స్మృతి ఇరానీ ఫోటోలను చూసే ఆమె ఫాలోవర్స్.. ఈ విషయాన్ని సులభంగా కనిపెట్టారు. ఇంకా లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.
 
ఇంతకీ విషయం ఏమిటంటే.. 30 వయస్సు దాటిన మహిళలు బరువు పెరిగిపోతుంటారు. అలా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా బరువు పెరిగారు. ఆమె బరువుకు సంబంధించి విమర్శలు కూడా వచ్చాయి. అయినా తన బరువుపై వచ్చిన కామెంట్లను స్మృతి లైట్‌గా తీసుకున్నారు. 
 
అంతేగాకుండా తన బరువు గురించి విమర్శించిన వారికి తాజా ఫోటోతో బదులిచ్చారు. వివాహం జరిగి 40 ఏళ్ల వయస్సున్న మహిళలకు ఏర్పడే శరీర మార్పులు ఇవే. హార్మోన్ల ప్రభావంతో మహిళలు బరువు పెరుగుతుంటారు. ఈ విషయాన్ని స్మృతి ఇరానీ ఈ ఫోటోల ద్వారా తెలియజేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు