యూట్యూబ్ స్టార్‌ ఆడమ్ సాలెకు చేదు అనుభవం: అరబిక్‌లో మాట్లాడిన పాపానికి దించేశారు..

శుక్రవారం, 23 డిశెంబరు 2016 (11:20 IST)
పాపులర్ యూట్యూబ్ స్టార్ ఆడమ్ సాలె. యెమెన్‌కు చెందిన ఇతనికి విమానంలో అవమానం జరిగింది. డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఆడమ్ సాలెకు చేదు అనుభవం ఎదురైంది. తల్లితో అరబిక్‌లో మాట్లాడినందుకుగాను విమాన సిబ్బంది అతడిని బలవంతంగా దించేశారు. ఈ యవ్వారాన్ని ఆడమ్ వీడియో తీసి ట్విట్టర్‌లో పెట్టాడు. బాయ్ కాట్ డెల్టా పేరిట హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశాడు. 
 
ఫ్రాంక్ వీడియో స్టార్ అయిన ఇతనికి యూట్యూబ్‌లో సుమారు 20 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. అసలు జరిగిన సంగతి ఏమిటంటే.. లండన్ నుంచి న్యూయార్క్‌కు డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరిన ఇతగాడు తల్లితో అరబిక్ భాషలో మాట్లాడడమే తప్పైందని.. అర్థంకాని భాషల్లో మాట్లాడుకుంటూ తోటి ప్రయాణీకులు ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. 
 
ఇది జాతి వివక్ష చూపడేమనని ఆడమ్ ఆగ్రహించి వీడియోగా మలచి చూపడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియోకు 2 లక్షల రీ-ట్వీట్స్ లభించడం విశేషం. అయితే మొత్తానికి ఈ ఘటన అనంతరం ఆడమ్ మరో విమానంలో న్యూయార్క్ బయల్దేరి వెళ్ళాడు.

వెబ్దునియా పై చదవండి