రాజన్నా... నిన్నాపగలరా... వైఎస్సార్ బయోపిక్ యాత్ర విశేషాలు
బుధవారం, 2 జనవరి 2019 (15:50 IST)
రాజన్న నిన్నాపగలరా... అంటూ యాత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. జననేతగా తెలుగు వాళ్ల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజల సమస్యల్ని నేరుగా వినటానికి మెదలు పెట్టని పాదయాత్రలో ముఖ్య ఘట్టాలన్ని తీసుకుని యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర.
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ అండ్ డైలాగ్ టీజర్లతో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్‌తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఇప్పుడు రాజన్నా నిన్నాపగలరా అంటూ సాగే రెండవ సింగిల్‌తో ఆయన పాదయాత్ర వలన ప్రజల ఆనందాన్ని చూపించారు.
ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ యాత్రని తెరకెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికులు సమీపిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 8న యాత్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్ యాక్టివిటిని యాత్ర సినిమాకి అనుగుణంగా వైవిధ్యంగా చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారనే విషయం మాత్రమే తెలుగు ప్రజలకి తెలుసు కాని ఆ పాదయాత్ర తన రాజకీయ యాత్రలో ఎంత కీలకమో కొంతమందికే తెలుసు.
అప్పటి రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ఆయన ప్రజలకి దగ్గరగా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవటానికి ఈ యాత్ర మెదలుపెట్టారు.. కాని ఆ యాత్రలో ఎన్ని విషయాలు ఆయన ఎంత దగ్గరగా చూశారో, సాధారణమైన కష్టాలు కూడా తీర్చుకోలేని అతి సామాన్యుల్ని ఎలా కలిసారో, పేదవారంటే ఎవరో.. వారు దేనికొసం చూస్తున్నారో ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఇలా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి మహానాయకుడు నేరుగా వచ్చి వారి సమస్యల్ని తెలుసుకోవటాన్ని పేద బడుగుబలహీన వర్గాల ప్రజలు తమ ఆనందాన్ని పాట రూపంలో మలిచారు.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి మాట్లాడుతూ... మడమ తిప్పని నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి పాత్రలో మమ్ముట్టి గారు నటిస్తున్నారు. మమ్ముటి గారు ప్రజానాయకుడు వైఎస్ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నారని నిస్సందేహంగా ప్రకటిస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన యాత్ర మొదటి లుక్‌కి, టీజర్‌కి, ఫస్ట్ సింగిల్‌కు రెండు రాష్ట్రాల ప్రజల నుండి అనూహ్యమైన స్పందన రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం.
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్‌తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం.
దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం.
ఈ సందర్భంగా యాత్ర రెండవ సింగిల్‌ని లెజెండరి రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్ట్రి గారు రచించారు. కె సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం యొక్క ప్రమోషనల్ ఈవెంట్స్ ఒక్కొక్కటి మేమే తెలియజేస్తాము.. ప్రతి తెలుగువాడికి ఈ సినిమా రీచ్ అయ్యేలా ప్రమోషన్‌ని ప్లాన్ చేస్తున్నాం. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఏకకాలంలో యాత్ర చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నాం అని అన్నారు.