ఆధునిక కళలు, సంస్కృతికి వేదికగా నిలిచిన హైదరాబాద్‌లోని దీవార్స్ స్టే క్యూరియస్ హెచ్‌క్యూ

ఆదివారం, 6 ఆగస్టు 2023 (22:24 IST)
హైదరాబాద్ లోని మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని వేడుక చేస్తూ దీవార్స్ స్టే క్యూరియస్ HQ నగర వాసులను ఆకట్టుకుంది. ఆసక్తికరమైన భాగస్వామ్యం, చిరస్మరణీయమైన ప్రదర్శనలతో శిల్పా హిల్స్‌లోని గ్యాలరీ78లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమం నగర వాసులకు వినూత్న అనుభవాలను అందించింది. లీనమయ్యే సంగీతం, మహోన్నత నృత్యం, ప్రయోగాత్మక వర్క్‌షాప్‌తో ఆధునిక- సాంప్రదాయ కళాత్మక వ్యక్తీకరణల యొక్క మహోన్నత కలయికను చూసారు.
 
సంగీత పరిశ్రమలో అనుభవజ్ఞుడు, ఎలక్ట్రానిక్ సంగీత నిర్మాత మూర్తోవిక్ వురఫ్ శ్రీరామ మూర్తి 18 సంవత్సరాలుగా సంగీతాన్ని చేస్తున్నారు. సమకాలీన నృత్యం- భరతనాట్యం ఆకర్షణీయమైన కలయికలో తన ఎలక్ట్రానిక్ సంగీతం, గాత్రాలతో కథనాన్ని అల్లిన మూర్తోవిక్, భరతనాట్యం నర్తకి అనహిత చలిహా మరియు కర్ణాటక గాయని గోపికా జైరామ్‌ల సహకారంతో 'ఫ్లోస్టేట్'తో ఆకట్టుకున్నారు. నగరంలో కొత్త మీడియా కళల గురించి ఆసక్తిగా ఉన్న వారి కోసం, దృశ్య-కళాకారుడు అనిరుద్ మెహతా, సంగీత సాంకేతిక నిపుణుడు మైల్స్ వారి మాస్టర్ పీస్ 'ఓవర్చర్'ను ఆవిష్కరించారు. 
 
రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం పొందటంతో పాటుగా కళ, డిజైన్, ఫ్యాషన్‌ పరంగా సృజనాత్మకతలతో ఉత్సాహపూరిత సంభాషణలో  ప్రేక్షకులు నిమగ్నమయ్యారు, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత నాగ్ అశ్విన్ రెడ్డి తాను చేస్తున్న 'కల్కి' సినిమా గురించి చెప్పటంతో పాటుగా  పరిశ్రమలో తన ప్రయాణం నుండి వ్యక్తిగత అనుభవాల వరకూ వెల్లడించారు.
 
డిజైనర్ కావ్య పొట్లూరి రూపొందించిన 'ది ఫ్యూచరిస్టిక్ బ్రైడ్' అనే ఆలోచనను రేకెత్తించే ఇన్‌స్టాలేషన్‌ను నగరంలోని ఫ్యాషన్ ప్రియులు అన్వేషించారు. DEWAR'S వేదికపైకి 'సిటీ సోల్స్' యొక్క కదిలే లైవ్-ఆర్ట్ షోకేస్‌ని తీసుకువస్తూ, మోనోక్రోమటిక్ కళాకారిణి సుషీ సర్జ్ కూడా ఉన్నారు. ఔత్సాహికులను ఆహ్లాదకరమైన అనుభవంలో ముంచెత్తుతూ, DEWAR'S Mixology ల్యాబ్, బకార్డి ఇండియా నుండి ఇష్రత్ కౌర్ మరియు వేన్ మైఖేల్ డేవిస్ లీనమయ్యే ప్రయోగాత్మక వర్క్‌షాప్‌లతో ఆధునిక మిక్సాలజీ యొక్క మధురమైన రుచిని ప్రేక్షకులకు అందించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు