పుష్కరాల ఉత్సవాలపై ‘సేవ్ టెంపుల్స్’ ఫోటోగ్రఫీ పోటీలు

బుధవారం, 10 జూన్ 2015 (20:44 IST)
దేవాలయ పరిరక్షణ, సనాతన ధర్మ రక్షణ ధ్యేయంగా మహోధ్యమంగా సాగుతున్న గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరియు సేవ్ టెంపుల్స్(USA) ఆధ్వర్యంలో జూలై 14 నుండి 25 వరకు జరిగే పుష్కర ఉత్సవాలపై ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రొ. వెలగపూడి ప్రకాశరావు మరియు సాంస్కృతిక ప్రచారసారథి డా. గజల్ శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. 
 
ఈ పోటీలలో పుష్కరాల విశిష్టత,, పుష్కరాల వైభవాన్ని, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలు, పుష్కర స్నాన ఘట్టాలలోని అపురూప దృశ్యాలను ప్రతిబింబించే విధంగా, కళ్ళకుకట్టినట్లుగా ఫోటోలు ఉండాలని తెలిపారు. 
 
ఈ పోటీలో పాల్గొనేవారు ఒక్కొక్కరు 10 ఫోటోలను పంపవచ్చు. DVD ఫార్మాట్‌లో ఎక్కువ స్పష్టత ఉన్న ఫోటోలను  కాపీ చేసి అప్లికేషను మరియు ఒప్పంద పత్రాలను జతచేసి ఈ దిగువ చిరునామాకు పంపగలరు. ఒప్పంద పత్రాలను savetemples.org వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చెసుకొనగలరు. మీ ఎంట్రీ తో పాటు మీ యొక్క గుర్తింపు కార్డును కూడా జత చేసి పంపగలరు. మీ ఎంట్రీలను 2015 ఆగష్టు 5 వ తేదీ లోపు ఈ క్రింది చిరునామాకు పంపగలరు.
 
 
GHHF & Savetemples.org  
6-3-629/2, A2
Kabir Nivas, Anand Nagar,
Khairatabad, Hyderabad
Telangana, India
Ph: +91 99126 26256
 
చిత్రం డేటా ఫైళ్లు స్మార్ట్ ఫోన్లు, (మధ్య మరియు పెద్ద ఫార్మాట్ కెమెరాలు ) డిజిటల్ స్టిల్ కెమెరాలతో సహా ఏ డిజిటల్ పరికరాలను ఉపయోగించైనా రూపొందించవచ్చు. సాఫ్ట్‌వేర్ లేదా ఇతర మార్గాల ద్వారా ఉపయోగించి రీటచ్ చేసే చిత్రాలు అంగీకరించబడతాయి. కెమెరా అనువర్తనం లేదా ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఉపయోగించి రీటచ్ ఫోటోగ్రఫీ కూడా అంగీకరించబడతాయి. కలర్ మరియు మోనోక్రోమ్ చిత్రాలు అంగీకరించబడతాయి. సినిమా నుండి తీసిన ఏ ఎంట్రీలు అంగీకరించబడవు. సినిమా కెమెరాల ద్వారా స్కాన్ చేసిన ఛాయాచిత్రాలకు అంగీకరించబడవు. ఛాయాచిత్రాలు గోదావరి పుష్కరాలు 2015లో మాత్రమే తీసినవై ఉండాలి. తీర్పు ప్రక్రియలో sRGB ప్రామాణికత ఉంటుంది. ఇందులో విజేతలను న్యాయనిర్ణేతలు 2015 ఆగష్టు 14వ తేదీన వెలువరిస్తారని తెలిపారు. 
 
విజేతలకు 
ప్రధమ బహుమతి :  Rs.50,000/-
ద్వితీయ బహుమతి : Rs.30,000/-
తృతీయ భాహుమతి : Rs.25,000/-
 
వీటితో పాటుగా ఐదు ప్రోత్సాహక పురస్కారాలు ఒక్కింటికి 5000 రూపాయలు మరియు ప్రశంసా పత్రము ఉంటాయని, అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహక ప్రశంసా పత్రము ఇవ్వ బడుతుందని తెలిపారు. 
 
పోటీలో పాల్గొనే ఆశక్తి కలవారు savetemples.org వెబ్‌సైట్‌లో ఉన్న ఆన్‌లైన్ అప్లికేషన్‌ను 2015 జూన్ 30వ తేది లోపు నింపి తమ సుముఖతను పంపగలరు. 
 
ప్రో” వెలగపూడి ప్రకాశరావు, అధ్యక్షులు  మరియు  డా” గజల్ శ్రీనివాస్ - సంస్థ ప్రచార సారధి
 
 

వెబ్దునియా పై చదవండి