బొట్టు పెట్టుకునేందుకు పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్ఠమైనది. పసుపు మన శరీరంపై అమితమైన ప్రభావాన్ని చూపుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి శరీర కాంతిని ఇనుమడింపజేస్తుంది.
కుంకుమను అమ్మవారి ప్రసాదంగా భావించి... సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను ప్రార్థిస్తూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి.
ఉంగరపు వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడిమివేలితో పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది. బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు. మన పెద్దలు, మనకోసం ఏర్పరిచిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది భారతీయులకే ప్రత్యేకం.