చిక్కులమారి హోటల్‌.... కడుపుబ్బ నవ్వించే జోక్

గురువారం, 5 జులై 2018 (15:53 IST)
పల్లెటూరి పద్మనాభం ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. వెయిటర్‌ని నూడుల్స్ తెమ్మనాడు. ఆ నూడుల్స్‌ను చూసిన వెంటనే వెయిటర్‌తో గొడవ పడుతున్నాడు పద్మనాభం. దీనిని చూసిన ఆ రెస్టారెంట్‌ యజమాని వచ్చి ఏమైందని అడిగాడు.
 
వెయిటర్‌: ఏం కావాలి అంటే నూడుల్స్‌ తెమ్మన్నాడు సార్‌... తీసుకొచ్చి ఇచ్చాను.
యజమాని: సరే ఏమైంది మరి. వేడిగా లేవా?
వెయిటర్‌: కాదు సార్‌ నూడుల్స్‌ మొత్తం చిక్కులు పడి ఉన్నాయని అన్నాడు.
పద్మనాభం: డబ్బులు కడుతున్నా కదా... చిక్కులన్నీ తీసి ఇమ్మన్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు