ఆగస్టు 7న పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' కన్‌ఫర్మ్
బుధవారం, 10 జులై 2013 (16:28 IST)
WD
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి. పతాకంపై భారీ నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేసారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రం గురించి చెబుతూ - ''పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్‌గార్ల కాంబినేషన్‌లో వస్తున్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అని కన్‌ఫర్మ్ చేసాం. స్పెయిన్‌లో 25 రోజుల పాటు భారీ షెడ్యూల్ చేసి వెంటనే హైదరాబాద్‌లో షెడ్యూల్ కంటిన్యూ చేస్తున్నాం.
ప్రస్తుతం పవన్‌కళ్యాణ్, సమంత, 'ఖుషి' ఫేమ్ ముంతాజ్, హంసానందినిలతో పాటు 100 మంది డ్యాన్సర్స్ పాల్గొనగా భారీ ఎత్తున గణేష్ నృత్య దర్శకత్వంలో పాట చిత్రీకరిస్తున్నాం. ఈ పాటతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. వచ్చేవారం ఆడియో రిలీజ్ చేస్తున్నాం. దేవిశ్రీప్రసాద్ ఎక్స్‌ట్రార్డినరీ ఆడియో ఇచ్చారు. వరల్డ్‌వైడ్‌గా 'అత్తారింటికి దారేది' హయ్యస్ట్ స్క్రీన్స్‌లో ఆగస్ట్ 7న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
WD
ఇట్స్ టైమ్ టూ పార్టీ!!
అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో పవన్ కళ్యాణ్, సమంత, ముంతాజ్, హంసానందినిలపై 'ఇట్స్ టైమ్ టూ పార్టీ' అంటూ రేవ్ పార్టీ సాంగ్ సూపర్‌గా వుందని, సెట్ బ్రహ్మాండంగా వుందని, పవర్‌స్టార్ స్టెప్స్ అదిరిపోయాయని, షూటింగ్ చూడటానికి వచ్చిన వారందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
ఈ పాట తీస్తుండగా బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్‌విద్యార్థి, నాగబాబు, రేయ్ హీరో సాయి ధరమ్‌తేజ్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు)లతో పాటు సెట్‌కి వచ్చిన వారంతా ఈ సాంగ్ సూపర్‌గా వుందని చెప్తున్నారు. ప్రేక్షకులు, పవర్‌స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అత్తారింటికి దారేది' సరికొత్త రికార్డులు సృష్టించడానికి ఆగస్ట్7న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతుంది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో-ప్రొడ్యూసర్స్: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రచన, దర్శకత్వం: త్రివిక్రమ్.