'గ్రీకు వీరుడు'కు యు/ఎ సర్టిఫికెట్... వరల్డ్‌వైడ్‌గా మే 3న విడుదల
బుధవారం, 24 ఏప్రియల్ 2013 (20:58 IST)
WD
కింగ్ నాగార్జున హీరోగా కామాక్షి మూవీస్ పతాకంపై అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన అగ్రనిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి కింగ్ నాగార్జున హీరోగా నిర్మిస్తున్న భారీ చిత్రం 'గ్రీకు వీరుడు' సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. వరల్డ్‌వైడ్‌గా మే 3న ఈ చిత్రం విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ - ''మా 'గ్రీకువీరుడు' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. వరల్డ్‌వైడ్‌గా మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి స్పందన లభిస్తోంది. థమన్ సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు.
త్వరలోనే ఈ చిత్రం హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో నాగార్జునగారి అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో వున్నాయి. తప్పకుండా మా 'గ్రీకువీరుడు' చిత్రం ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుంది. మా బేనర్‌లో ఈ చిత్రం మరో సూపర్‌హిట్ చిత్రం అవుతుంది'' అన్నారు.