జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా మహేష్‌-సుకుమార్‌ల మహేష్‌ '1' (నేనొక్కడినే)

గురువారం, 26 డిశెంబరు 2013 (17:50 IST)
WD
సూపర్‌స్టార్‌ మహేష్‌తో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై 'దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని నిర్మించిన రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర తాజాగా సుకుమార్‌ దర్శకత్వంలో '1(నేనొక్కడినే)' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్న మా '1' చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ముందుగా ప్రకటించిన విధంగానే జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది.

ఆడియో సేల్స్‌ పరంగా, డౌన్‌లోడ్స్‌ పరంగా నెంబర్‌ వన్‌ ఆడియోగా నిలిచింది. దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన వెరైటీ మ్యూజిక్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తయింది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ తనయుడు గౌతమ్‌ చిన్నప్పటి మహేష్‌గా నటించడం ఈ చిత్రానికి మరో హైలైట్‌ అని చెప్పొచ్చు. సూపర్‌స్టార్‌ మహేష్‌ కాంబినేషన్‌లో మా బేనర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా '1' నిలుస్తుంది'' అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుకుమార్‌.

వెబ్దునియా పై చదవండి