'గజిని', 'యముడు' వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత సూర్య హీరోగా స్టూడియో గ్రీన్ కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై హరి దర్శకత్వంలో ఎస్.లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన 'సింగం'(యముడు-2) చిత్రం వరల్డ్‌వైడ్‌గా జూలై 5న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.ఇ.జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - ''మా బేనర్‌లో వచ్చిన 'యముడు' చిత్రం ఎంత బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలసిందే. దానికి సీక్వెల్‌గా వస్తున్న 'సింగం' దాన్ని మించిన విజయం సాధిస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం.
యముడు చిత్రానికి దేవిశ్రీప్రసాద్ చాలా ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ చిత్రం ఆడియో పరంగా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు సింగం చిత్రం ఆడియో కూడా సూపర్‌హిట్ అయింది. అలాగే సినిమా కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాము'' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: వి.టి. విజయన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సినిమాటోగ్రఫి: ప్రియన్, నిర్మాత: ఎస్.లక్ష్మణ్‌కుమార్, దర్శకత్వం: హరి.