శ్రీ హీరోగా అక్ష హీరోయిన్‌గా నటించిన సినిమా 'రయ్‌రయ్'. రయ్‌రయ్ అంటూ అల్లరి చిల్లరిగా తిరిగే గ్రామీణ యువకుడు చాలా కేర్‌లెస్‌గా ఉంటాడు. దేన్ని లెక్కచేయడు. అటువంటి వ్యక్తి కథతో 'రయ్‌రయ్' చిత్రం రూపొందింది. బి. రామకృష్ణ, ఎస్.ఎన్.రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని ఐదుపాటలకు విశేష ఆదరణ లభించిందనీ, ఈనెలాఖరులో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
దర్శకుడు సుధీర్‌రాజు మాట్లాడుతూ, చాలా కేర్‌లెస్‌గా ఉండే యువకుని జీవితంలో బాధ్యత ఎలా గుర్తెరిగి మారిపోయాడనేది ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపించాం అన్నారు. సంగీత దర్శకుడు శ్రీవసంత్ మాట్లాడుతూ, సుడిగాడు- చిత్రం తర్వాత మళ్ళీ సక్సెస్ చిత్రంలో పనిచేశానని భావిస్తున్నాను. అన్ని పాటలు హిట్టే. రీరికార్డింగ్ చేశాక సినిమాపై మరింత నమ్మకం పెరిగిందని అన్నారు.
హీరో శ్రీ మాట్లాడుతూ, ఇటీవలే ట్రైలర్స్ విడుదలయ్యాయి. మంచి రెన్సాన్స్ వచ్చింది. కాకర్లశ్యామ్ తెలంగాణా టైప్ పాటను రాశారు. అది చిత్రంలో హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు. వల్లారిటీలేని చక్కటి ఎంటర్‌టైనర్ ఇది అని చెప్పారు.