వరుణ్ సందేశ్, సంచితా పదుకొనే, కాథరిన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'చమ్మక్ చల్లో'. ఈ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేస్తున్నామని చిత్ర దర్శకుడు నీలకంఠ చెప్పారు. సోమవారంనాడు ఆయన మాట్లాడుతూ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీసిన సినిమా. ఇంతవరకు నేను అది మిస్ అయ్యానని ఫీలయ్యాను. అందుకే కొత్త ప్రయోగం చేశాను. అవార్డు సినిమాలకే కానీ రికార్డులు కాలేదు. అందుకే ఆ ప్రయత్నం చేశాను' అన్నారు.
నిర్మాత డి.ఎస్. రావు మాట్లాడుతూ, ఈ చిత్రంలోని పాత్రలు ముఖ్యంగా వరుణ్ సందేశ్ క్యారెక్టర్ రియల్‌లైఫ్‌లో మనకు కన్పించేవే. ఈ చిత్రాన్ని చూశాక నైజాంలో మా స్నేహితుడు రిలీజ్ చేస్తున్నాడు. మిగిలిన చోట్ల సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తుంది. 200 థియేటర్లలో ఈ చిత్రాన్ని 15న విడుదల చేస్తున్నానని' అన్నారు. సంచితా పదుకొనే, కాథరిన్ మాట్లాడుతూ, ఇందులో మంచి పాత్రలు పోషించామనీ, గుర్తింపు వస్తుందని అన్నారు.