క్రియేటివ్ థాట్స్‌తో సినిమాలను రూపొందిస్తూ తనకంటూ సెపరేట్ బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ, యువ హీరో నాని, వరుస విజయాలను సాధిస్తున్న టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రమేష్ పుప్పాల. ఈ ముగ్గురు రేర్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం 'పైసా'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ - ''మా బేనర్‌లో కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రంగా రూపొందిస్తున్న 'పైసా' చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 7న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. కృష్ణవంశీగారి కెరీర్‌లో, నాని కెరీర్‌లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం నాకు వుంది. ఇదో కొత్త తరహా కమర్షియల్ మూవీ. కృష్ణవంశీగారు చాలా అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని డీల్ చేశారు. ఇప్పటికే ఈ ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. సినిమా కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం'' అన్నారు.