మార్చి 22న ప్రేక్షకుల ముందుకు సూర్య 'కంచు'

సోమవారం, 4 మార్చి 2013 (18:28 IST)
WD
'గజిని' ఫేమ్‌ సూర్య, గ్లామర్‌ స్టార్‌ త్రిషల కాంబినేషన్‌లో అమీర్‌ దర్శకుడుగా ఇటీవల తమిళంలో విడుదలై సూపర్‌హిట్‌ అయిన 'మౌనం పేసియదే' చిత్రాన్ని మాంగో మాస్‌ మీడియా ప్రైవేట్ లమిటెడ్ సంస్థ అధినేత రామ్‌ వి. భారీ ఆఫర్‌తో తెలుగు రైట్స్‌ని సొంతం చేసుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పలు హిట్‌ చిత్రాల్ని పంపిణీ చేసిన శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ అధినేత ఎం. వెంకట్రావు ఫ్యాన్సీ రేటు వెచ్చించి 'కంచు' చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ అంతటా రిలీజ్‌ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర విశేషాలను డిస్ట్రిబ్యూటర్‌ ఎం. వెంకట్రావు తెలియజేశారు.

ప్రేమకి సరికొత్త నిర్వచనం చెప్పే చిత్రం 'కంచు'!!
డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత ఎం. వెంకట్రావు మాట్లాడుతూ - ''తమిళంలో సూపర్‌హిట్‌ అయి వంద రోజులు ఆడిన 'మౌనం పేసియదే' చిత్రాన్ని 'కంచు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్‌ చేయడానికి నాకు అన్నివిధాలా సహకరిస్తున్న నిర్మాత రామ్‌కి నా ధన్యవాదాలు. ఇక సినిమా విషయానికి వస్తే ఇంతవరకు చేయనటువంటి ఒక కొత్త క్యారెక్టర్‌లో సూర్య నటించారు. లవ్‌లీ క్యారెక్టర్‌లో త్రిష ఫెంటాస్టిక్‌గా నటించింది. అలాగే త్రిష గ్లామర్‌తోపాటు పెర్ఫామెన్స్‌ కూడా వన్‌ఆఫ్‌ ది హైలైట్‌గా ఈ చిత్రంలో నిలుస్తుంది. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం వుంటుంది. ఇప్పటివరకు ప్రేమకథా చిత్రాలు ఎన్నో వచ్చాయి. కానీ ప్రేమకు ఒక కొత్త నిర్వచనం చెప్పే మాస్‌ క్యారెక్టర్‌లో సూర్య అద్భుతంగా నటించాడు.
WD


ప్రతి సీన్‌ థ్రిల్‌ కలిగిస్తుంది!!
'గజిని' తర్వాత సూర్యకి తెలుగులో సరైన బ్రేక్‌ రాలేదు. ఆ లోటుని మా 'కంచు' చిత్రం భర్తీ చేస్తుంది. యువన్‌ శంకర్‌ రాజా ఈ సినిమాకి ఎక్స్‌లెంట్‌ సంగీతాన్ని అందించాడు. ఆడియో సెన్సేషనల్‌ హిట్‌ అయింది. ఈ చిత్రం ద్వారా ది బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఫిలింఫేర్‌ అవార్డ్‌ని యువన్‌శంకర్‌ రాజా అందుకున్నారు. యూత్‌కి నచ్చేవిధంగా వెన్నెలకంటి మాటలు, పాటలు అందించారు. ప్రముఖ దర్శకుడు అమీర్‌ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి మరో హైలైట్‌గా చెప్పవచ్చు. ఆద్యంతం ఆహ్లాదకరంగా ప్రతి సీన్‌ని రక్తికట్టించాడు.

సినిమా చూస్తున్నంతసేపు ఇది మన లవ్‌ స్టోరీయేనా అనిపిస్తుంది. అలాగే యాక్షన్‌ సన్నివేశాలు సూర్య స్టైల్‌లో డిఫరెంట్‌గా వుంటాయి. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు థ్రిల్‌ కలిగించేలా ఈ సినిమా వుంటుంది. సూర్య కెరీర్‌లో ఈ సినిమా మంచి హిట్‌ చిత్రంగా నిలుస్తుంది. అలాగే తెలుగులో సూర్యకు సూపర్‌హిట్‌ ఫిలిమ్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ వుంది. 'కంచు' సినిమా పెద్ద హిట్‌ అయి డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.