మే 25న 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి'

మంగళవారం, 21 మే 2013 (14:30 IST)
WD
లవర్‌బోయ్‌ తరుణ్‌, విమలారామన్‌ జంటగా విజయ్‌ చాబ్రియా సమర్పణలో సుప్రీమ్‌ మూవీస్‌ పతాకంపై కన్మణి దర్శకత్వంలో రాజు హర్వాణి నిర్మించిన చిత్రం 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 25న విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత రాజు హర్వాణి మాట్లాడుతూ - ''అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే బ్యూటిఫుల్‌ చిత్రమిది. తరుణ్‌, విమలా రామన్‌ చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేశారు. ఈ సినిమాకి అనూప్‌ అందించిన మ్యూజిక్‌ ప్లస్‌ అవుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. యూత్‌కి చక్కని సందేశాన్ని అందించే విధంగా రూపొందిన ఈ చిత్రాన్ని యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఎంజాయ్‌ చేస్తారు. కన్మణి చాలా ఎక్స్‌లెంట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా క్వాలిటీగా రావాలన్న ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా రిచ్‌గా తీయడం జరిగింది. మే 25న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.

తరుణ్‌, విమలారామన్‌, బ్రహ్మానందం, ధర్మవరపు, కాశీవిశ్వనాధ్‌, ప్రగతి, రక్ష, చిత్రం శ్రీను, విజయసాయి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సమర్పణ: విజయ్‌ చాబ్రియా, నిర్మాత: రాజు హర్వాణి, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కన్మణి.

వెబ్దునియా పై చదవండి