డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్ సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై కింగ్ నాగార్జున, రామ్మోహన్ పి. నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'ఉయ్యాల జంపాల'. విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ తరుణ్, అవిక (చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ఫేం ఆనంది) నటీనటులు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించారు.
దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ... మంచి సంస్థల ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. రామ్మోహన్ గారితో వర్క్ చేస్తుంటే నా ఫ్రెండ్‌తో వర్క్ చేసినట్లుంది. ఆయనతో రెండు సంవత్సరాల ట్రావెల్ రెండు నెలలుగా గడిచిపోయింది. కథ కల్పితమైనప్పటికీ విలేజ్‌లో నేను చూసిన కొన్ని పాత్రలను ఈ చిత్రంలో చూపించాను. సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. సినిమా చూశాక ప్రతి ఒక్కరు తమ ఊరిని చూడాలనుకుంటారు. పల్లెటూరి వారు, పల్లె నుండి పట్టణానికి వచ్చిన వారు ఈ సినిమా చూసి ఐడెంటిఫై అవుతారు. సన్ని చక్కని పాటలిచ్చారు అని తెలిపారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ... అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేద్దామని వచ్చాను. కానీ ఈ సినిమాకి హీరోని చేసేశారు. అచ్చమైన తెలుగు చిత్రమిది. చక్కని అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.
హీరోయిన్ అవిక మాట్లాడుతూ... చిన్నారి పెళ్ళికూతురు సీరియల్‌లో ఆనందిగా నన్ను ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రసాద్‌గారి వల్ల ఈ చిత్రంలో అవకాశం వచ్చింది. తరువాత ఆడిషన్స్, లుక్ టెస్ట్ చేసి ఒకలైన్ డైలాగ్ చెప్పమన్నారు. హిందీ, ఇంగ్లీష్‌లో చెప్పాను అంతే... ఉయ్యాలా జంపాలా సినిమాకి హీరోయిన్ అయిపోయాను. డిఓపి విశ్వ నన్ను చాలా గ్లామర్‌గా చూపించారు. సన్నీ అందించిన పాటలు అందరికీ నచ్చుతాయి. సినిమాలో నాకు, రాజ్ తరుణ్‌కి 75 పర్సెంట్ గొడవ జరుగుతూనే ఉంటుంది అని అన్నారు.