హృద‌యాల్ని కదిలించే న‌య‌న‌తార 'క‌ర్త‌వ్యం'.. ఉగాది సంద‌ర్భంగా మార్చి 16న విడుద‌ల

గురువారం, 15 మార్చి 2018 (20:30 IST)
ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో న‌టించిన స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్, క్రేజి ప్రాజెక్టుల‌తో విజ‌యాల్ని సాధిస్తున్న‌ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తంగా ట్రైడెంట్ ఆర్ట్స్(Trident Arts ) పతాకంపై తమిళంలో ఇటీవలే విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ఆరమ్ (Araam)  చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో మార్చి 16న విడుదల చేస్తున్నారు. నయనతార ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా పాత్ర‌లో లీన‌మై న‌టించారు. ఇటీవ‌ల స్పెష‌ల్ ప్రీమియ‌ర్‌గా పాత్రికేయ మిత్రుల‌కి వేశారు. చూసిన ప్ర‌తి ఒక్క మిత్రుడు భావోద్వేగంతో త‌మత‌మ ఫీలింగ్స్‌ని సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌ప‌రిచారు. ఇంత మంచి చిత్రాన్ని తెలుగుకు తీసుకువ‌చ్చిన నిర్మాత శ‌ర‌త్‌మ‌రార్‌కి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు.
 
ఈ స్పంద‌న విన్న హీరోయిన్ న‌య‌న‌తార మాట్లాడుతూ.. గ‌త ఏడాది త‌మిళంలో విడుద‌ల‌ై ఘ‌న‌ విజ‌యం సాధించిన ఆరమ్ చిత్రాన్ని తెలుగులో క‌ర్త‌వ్యం పేరుతో విడుద‌ల చేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఒక మంచి పాయింట్‌తో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు క‌ళ్ళ‌కుక‌ట్టే విధంగా చిత్రీక‌రించిన తీరు ప్ర‌శంసనీయం. మారుమూల ప‌ల్లెటూళ్ళ‌లో చిన్నపిల్లలు బోరు బావిలో ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌డిపోతుంటే అటు అధికారులు, ఇటు ప్ర‌జ‌లు ఆ పిల్లల్ని కాపాడ‌టానికి ప్ర‌య‌త్నించే తీరు అభినంద‌నీయం. కానీ దానికి కావ‌ల‌సిన వ‌స‌తులు క‌ల్పించ‌క పోవ‌టం చాలా బాధాకరం. ఈ విష‌య‌మే న‌న్ను ఈ చిత్రం చేయ‌టానికి ముందుకొచ్చేలా చేసింది. తెలుగులో జ‌ర్న‌లిస్టులు చూసి అభినందటం చాలా ఆనందంగా వుంది. వారికి నా త‌రుపున థ్యాంక్స్‌. ఉగాది సంద‌ర్భంగా మార్చి 16న విడుద‌లవుతున్న ఈ చిత్రం మ‌న‌సున్న ప్ర‌తివారికి న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను అన్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ "తమిళంలో ఆర‌మ్ చిత్రం సూప‌ర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార కెరీర్లోనే పెద్ద విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం మాకు ఉంది. ఇప్ప‌టికే చిత్రాన్ని చూసిన మీడియా మిత్రులు చాలా మంచి రివ్యూస్ ఇవ్వ‌టం నూత‌న ఉత్సాహాన్ని క‌లిగించింది. ఆడుకుంటున్న పిల్లలు బోరు బావిలో ప‌డిపోతే, అక్కడ జ‌రుగుతున్న ఆప‌రేష‌న్ క‌థా వ‌స్తువుగా తీసుకుని రియ‌లిస్టిక్‌గా బాగా ద‌గ్గ‌ర‌గా ప్ర‌తి ఒక్క‌రి హృద‌యం కదిలించేలా అద్భుత‌మైన‌ నేరేష‌న్‌తో ద‌ర్శ‌కుడు గోపి నైన‌ర్ తెర‌కెక్కించాడు. ఆ ఆప‌రేష‌న్ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా క‌లెక్ట‌ర్ పాత్ర‌లో న‌య‌న‌తార న‌ట‌విశ్వ‌రూపానికి ప్రేక్ష‌కులు జేజేలు కొట్టారు.
 
ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. చక్రం, డేంజర్ మరియు కృష్ణార్జున చిత్రాలకి పనిచేసిన ఓం ప్రకాష్ ఈ చిత్రానికి కెమరామెన్‌గా వ్యవహరించారు. నటీనటులు : నయనతార, విగ్నేష్, రమేష్, సును లక్ష్మి, వినోదిని వైద్యనాథన్, రామచంద్రన్ దురైరాజ్, ఆనంద్ కృష్ణన్, కథ-దర్శకత్యం : గోపి నైనర్, నిర్మాత : శ‌ర‌త్ మ‌రార్‌, ఆర్ రవీంద్రన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు