రాంగోపాల్ వర్మ 'ఆఫీసర్' ఏమవుతాడో... ఈ క‌థ‌కు ఇన్స్పిరేష‌న్ ఎవ‌రంటే?

బుధవారం, 30 మే 2018 (14:21 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేష‌న్లో రూపొందిన తాజా చిత్రం ఆఫీస‌ర్. స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా యు/ఎ సర్టిఫికేట్‌ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా విడుదలకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. జూన్ 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
చాలా కాలం తరువాత వర్మ .. నాగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వలన, 'శివ'ను మించినదిగా ఈ సినిమా ఉంటుందని వర్మ చెప్పడం వలన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్ప‌డింది. కర్ణాటకకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం జరిగిందని చెప్పడం వలన అందరిలో ఆత్రుత పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్‌కి .. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో, తప్పకుండా ఈ సినిమా సక్సెస్‌ను సాధిస్తుందని భావిస్తున్నారు. మ‌రి... ఆఫీస‌ర్ ఆక‌ట్టుకుంటాడా..? లేదా..? అనేది జూన్ 1న తెలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు