టాలీవుడ్ కింగ్ నాగార్జున - సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ఆఫీసర్. స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఆఫీసర్ చిత్రం జూన్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఆఫీసర్ ప్రి-రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని హీరోలు సుమంత్, నాగ చైతన్య, అఖిల్ పాల్గొన్నారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ ఆఫీసర్ పైన అంచనాలను పెంచేసింది.
ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ... తెలుగు పరిశ్రమ గురించి శివకు ముందు, శివ తరవాత అంటూ మాట్లాడుకుంటారు. శివ సినిమా నాకు బ్రేక్ మాత్రమే కాదు.. అమలనీ ఇచ్చింది. ఈ సినిమాకి యంగ్ టీమ్ వర్క్ చేసింది. ఈ యంగ్ టీమ్‌తో వర్క్ చేయడంతో నాలో మార్పు వచ్చినట్టు అనిపించింది. షూటింగ్‌కి వెళ్లే ముందు వర్మ నాకో ఉత్తరం రాశాడు. అందులో బూతు మాటలు కూడా ఉన్నాయి. అందుకే దాన్నిఇప్పుడు చదవడం లేదు. ఆ లెటర్‌లో... తను చెప్పింది చేయకపోతే తన్నమన్నాడు. సినిమా చూసి చెబుతున్నాను.. తనని తన్నవలసిన అవసరం లేదు అన్నారు.
ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుతూ... శివ విడుదలైనప్పుడు సౌండ్ గురించి మాట్లాడారు. ఆ తరవాత ఏ సినిమా గురించి అలాంటి మాటలు వినిపించలేదు. నా సినిమా అని చెప్పడం లేదు. ఇది నిజం. ఇప్పుడు ఆఫీసర్ సౌండ్ గుండెల్ని తాకుతుంది. యాక్షన్ సన్నివేశాలు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల తరవాత ఇంటెన్స్ ఉన్న యాక్షన్ సినిమా వస్తోంది జూన్ 1 అన్నారు.