అందుకే... గేమ్ ఓవ‌ర్ చిత్రాన్ని అలా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం - తాప్పీ

గురువారం, 13 జూన్ 2019 (19:36 IST)
ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు తెర‌కు పరిచయమై.. తొలి ప్ర‌య‌త్నంలోనే ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుని త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న‌ క‌థానాయిక తాప్సీ. రెగ్యుల‌ర్ చిత్రాలు కాకుండా విభిన్న క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు వెళుతుంది.  రీసెంట్‌గా వైనాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్స్ పైన అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో ఎస్‌. శశికాంత్‌ నిర్మించిన చిత్రం గేమ్‌ ఓవర్‌.
 
తాప్సీ న‌టించగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ గేమ్ ఓవ‌ర్ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాప్సీ చిత్ర విశేషాల‌ను తెలియ‌చేస్తూ.... హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ తెలుగులో మాత్రం ఏడాదికో సినిమా చేస్తున్నాను. అయితే తమిళ్‌లో చాలా గ్యాప్‌ వచ్చింది. కాంచన 2 తర్వాత అక్కడ మళ్ళీ సినిమా చేయలేదు. కోలీవుడ్‌కి దూరమవుతున్నా అనుకుంటున్న సమయంలో అశ్విన్‌ శరవణన్‌ ఈ కథ చెప్పాడు. 
 
కథ వినగానే ఇంప్రెస్‌ అయ్యాను. అతను డైరెక్ట్‌ చేసిన మాయ సినిమాలో కొన్ని సీన్స్‌ చూసాను. స్టఫ్‌ ఉన్న డైరెక్టర్‌ అనిపించింది అందుకే వెంటనే ఒకే చెప్పేసాను. ఆ తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో కూడా బైలింగ్వెల్‌ చేద్దామని ఫిక్స్‌ అయ్యాం.
 
 ఇక ఈ సినిమా క‌థ గురించి చెప్పాలంటే.... ఇండియన్‌ సినిమాలోనే ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి క‌థ‌తో ఏ సినిమా రాలేదు. అందుకే కథ విన్న వెంటనే ఏ భాషలో అయినా పరవాలేదు ఈ సినిమా చేయాలి అని డిసైడ్‌ అయ్యాను. 
 
హోం ఇన్వజన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్‌ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో కథ, కథనం చాలా కొత్తగా ఉంటాయి. నిజానికి సినిమాకు అవే మెయిన్‌ హైలైట్‌. నా క్యారెక్టర్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. కానీ... స్టోరీ, స్క్రీన్‌ ప్లే నా క్యారెక్టర్‌ని డామినేట్‌ చేస్తాయి. అందుకే ఈ సినిమా కాన్సెప్ట్‌ పరంగా టాప్‌లో ఉంటుంది.
 
 ఈ సినిమాను కేవలం తెలుగు, త‌మిళ్ మాత్రమే తెరకెక్కించాం. హిందీలో డబ్బింగ్‌ సినిమాగా విడుదలవుతోంది. అనురాగ్‌ కశ్యప్‌ ఈ సినిమా చూసి హిందీలో డబ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఇది భాషతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్‌ అయ్యే కాన్సెప్ట్‌. అందుకే ఈ సినిమాను ప్యాన్‌ ఇండియా అంతటా రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు