'ఇద్దరమ్మాయిలతో' సెన్సార్‌ పూర్తి - మే 31 వరల్డ్‌వైడ్‌గా విడుదల

శుక్రవారం, 24 మే 2013 (17:38 IST)
WD
స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై శివబాబు బండ్ల సమర్పణలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ నెల 31న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది

ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ - ''మా 'ఇద్దరమ్మాయిలతో..' సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు చాలామంచి సినిమా తీశారని మమ్మల్ని ప్రశంసించడం ఆనందం కలిగించింది. ఈ సినిమా బేనర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ అవుతుందన్న నమ్మకం కలిగింది. బన్నీ కెరీర్‌లో నెంబర్‌ వన్‌ హిట్‌గా, పూరిగారి కెరీర్‌లో మరో 'పోకిరి' అంత సెన్సేషనల్‌ హిట్‌గా, మా బేనర్‌కి మరో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా 'ఇద్దరమ్మాయిలతో..' నిలబడుతుంది.

బన్నీ పెర్‌ఫార్మెన్స్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌ అన్నీ ఈ సినిమాకి హైలైట్స్‌. పూరిగారి టేకింగ్‌, డైలాగ్స్‌ సినిమాని చాలా పెద్ద రేంజ్‌కు తీసుకెళ్తాయి. దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన ఆడియో ఆల్‌రెడీ టాప్‌ లేచిపోయింది. దేవి రీ-రికార్డింగ్‌ ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌. అలాగే కిచ్చా ఫైట్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు అందరూ. హీరోయిన్స్‌ అమలాపాల్‌, కేథరిన్‌ ఇద్దరూ యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేస్తారు. బ్రహ్మానందంగారి క్యారెక్టర్‌ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ అవుతుంది. మే 31న వరల్డ్‌వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతున్న 'ఇద్దరమ్మాయిలతో..' గ్యారెంటీగా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది'' అన్నారు.

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌, అమలాపాల్‌, కేథరిన్‌, బ్రహ్మానందం, నాజర్‌, షావర్‌ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా: అమోల్‌ రాథోడ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, కో డైరెక్టర్‌: రెడ్డి తరణీరావు, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

వెబ్దునియా పై చదవండి