యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో ఎగ్రెసివ్ హీరో గోపీచంద్, ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం వంటి వైవిధ్యమైన, విజయవంతమైన చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై భారీ చిత్రాల 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'సాహసం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 21న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'సాహసం' చిత్రాన్ని ఈనెల 21న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం ఆడియో ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. శ్రీ చాలా ఎక్స్లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. రీ-రికార్డింగ్‌కి ఎంతో ప్రాధాన్యత వున్న ఈ చిత్రానికి శ్రీ అద్భుతంగా ఆర్.ఆర్. చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో మా బేనర్లో వస్తోన్న ఎడ్వంచరస్ ఎంటర్టైనర్ ఇది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చంద్రశేఖర్ యేలేటి స్టైల్లో వుంటూనే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది. గోపీచంద్‌కి డెఫినెట్‌గా ఇది సూపర్‌హిట్ సినిమా అవుతుంది. అలాగే మా బేనర్లో మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు.