జూలై నెలాఖరులో సుశాంత్‌ 'అడ్డా'

శనివారం, 13 జులై 2013 (17:15 IST)
WD
'కాళిదాసు', 'కరెంట్‌' చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సుశాంత్‌ తాజాగా శ్రీనాగ్‌ కార్పోరేషన్‌ పతాకంపై జి.కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న భారీ చిత్రం 'అడ్డా'. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''మా 'అడ్డా'కి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై నెలాఖరులో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో సెన్సేషనల్‌ హిట్‌ అయింది.

అనూప్‌ రూబెన్స్‌ అందించిన ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రం ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ చేయబోతున్నాం. ఆడియో సూపర్‌హిట్‌ కావడంతో సినిమా మీద మాకు వున్న నమ్మకం రెట్టింపు అయింది. 'అడ్డా' మా బేనర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రమవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం'' అన్నారు.

సుశాంత్‌, శాన్వి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్‌, తాగుబోతు రమేష్‌, నల్లవేణు, ధన్‌రాజ్‌, స్వప్నిక తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: కనల్‌కణ్ణన్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఎం.వి.ఎస్‌.వాసు, కో-డైరెక్టర్స్‌: డి.సాయికృష్ణ, పి.శ్రీను, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: జి.కార్తీక్‌రెడ్డి.

వెబ్దునియా పై చదవండి