రేపే 'నా సామిరంగ'... చూసి నవ్వుదామన్నా నవ్వు రాలేదే...!!

గురువారం, 12 సెప్టెంబరు 2013 (18:47 IST)
FILE
పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలో 'నా సామిరంగ' అంటూ పవన్‌ పలికే డైలాగ్‌ను తీసుకుని సినిమా టైటిల్‌గా మార్చి తెరకెక్కించిన చిత్రం రేపు విడుదలవుతుంది. ఈ రోజు ప్రివ్యూ ప్రదర్శించారు. అయితే పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌.... ఇరగదీసేస్తుంది. రిలీజ్‌కు ముందే క్రేజ్‌ అంటూ ప్రకటనలు గుప్పించారు. కానీ సినిమా చూశాక నవ్వు తెప్పించకపోవడం సినిమాలో ప్రధాన లోపం.

సంభాషణలు, ఫొటోగ్రఫీ బాగున్నా నటీనటులు చేసిన పనులు హాస్యాన్ని పండించలేకపోయాయి. యువత చుట్టూ తిరిగే సన్నివేశాలే లక్ష్యంగా చేసుకుని తీసినట్లు కన్పిస్తుంది. నలుగురు కుర్రాళ్లు జైలుకెళ్ళి అక్కడ విలన్‌ను కూడా తమ టాలెంట్‌తో మార్చేస్తారు.

ఇందులోనూ ముగ్గురు కుర్రాళ్లు తాము చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు దుబాయ్‌ డాన్‌ను ఎలా మార్చగలిగారు అన్నది పాయింట్‌. సినిమా అంతా వారిచుట్టూ ఫస్టాఫ్‌ తిరగడం... వారి చేష్టలతో పిచ్చెక్కిస్తారు. హాస్యం పేరుతో చేసిన ప్రయోగం కూడా వర్కవుట్‌ కాలేదు. మరి ప్రేక్షకులు ఎలా తీర్పిస్తారో చూద్దాం.

వెబ్దునియా పై చదవండి