శ్రీహరి 'పోలీస్ గేమ్'... సెప్టెంబరు 20న రిలీజ్...

బుధవారం, 18 సెప్టెంబరు 2013 (12:32 IST)
WD
శ్రీహరి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'పోలీస్‌ గేమ్‌'. దేవ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుజాతదేవా నిర్మించారు. నాగమల్లి శంకర్‌ సమర్పకుడు. సహదేవరెడ్డి డి.వి దర్శకుడు. సంతూరి, నీను కార్తిక నటీనటులు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 20న విడుదలకు సిద్ధమైంది.

దర్శకుడు సహదేవరెడ్డి డి.వి మాట్లాడుతూ... డ్రగ్స్‌ మాఫియాకి నేటి యువత ఎందుకు బానిసలవుతున్నారు. అందుకు కారణాలేంటి? ఆ డ్రగ్స్‌ మాఫియాని ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ఎలా హతమార్చాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. శ్రీహరి అద్భుతంగా యాక్ట్‌ చేశారు. సిస్టర్‌ సెంటిమెంట్‌తోపాటు మంచి సందేశం కూడా ఉంది. నా మిత్రులు నట్టి కుమార్‌, నాగమల్ల శంకర్‌ సహకారంతో విడుదల చేస్తున్నాం. శ్రీహరి నటించిన భద్రాచలం చిత్రాన్ని మించి ఈ చిత్రముంటుంది అని అన్నారు.

విశాఖ టాకీస్‌ ద్వారా ఈ నెల 20న, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో విడుదల చేస్తున్నాం. ఆల్‌రెడీ థియేటర్స్‌ బ్లాక్‌ చేశాం అని నట్టి కుమార్‌ తెలిపారు. శ్రీహరికి బెస్ట్‌ పిక్చర్‌ అవుతుందని చిత్ర సమర్పకుడు నాగమల్ల శంకర్‌ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి