'సూపర్ మోడల్' ఇలా ఉంటుందా...? నగ్న సినిమాలు వచ్చేస్తున్నాయా...!!
శుక్రవారం, 20 సెప్టెంబరు 2013 (14:31 IST)
IFM
పాకిస్తాన్ సెక్సీ బాంబ్ వీణా మాలిక్ సూపర్ మోడల్ అంటూ త్వరలో ఇండియన్ సిల్వర్‌స్క్రీన్ పైకి దూసుకురాబోతోంది. సూపర్ మోడల్ అంటూ ఆమె తన ఎద నుంచి నడుము వరకూ ఓ కార్డును పట్టుకుని నిలుచున్న బొమ్మ ఇపుడు చర్చనీయాంశమైంది. ఆమె ఆ ఫోజును నగ్నంగా ఇచ్చేసిందా అనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి.
వీణా మాలిక్ మాత్రం తన జీవితంలో ఇంతవరకూ నటించని అద్భుతమైన పాత్రలో నటిస్తున్నానని అంటోంది. మొత్తం ఐదుగురు మోడళ్ల జీవితాల మధ్య ఈ సినిమా సాగుతుందట. బికినీ క్యాలెండర్లో పాల్గొన్న ఈ ఐదుగురిలో సూపర్ మోడల్‌గా వీణా మాలిక్ నటిస్తోంది.
ఐతే అలా సూపర్ మోడల్‌గా ఎదిగడానికి ఆమె ఎలాంటి కష్టాలు పడిందన్నది సినిమా అని చెపుతున్నారు. సినిమాలో కష్టాల సంగతి ఏమోగానీ, సూపర్ మోడల్ కార్డుతో నగ్నంగా ఫోజిచ్చిందుకు వీణా మాలిక్ ఎలాంటి కష్టమూ పడినట్లు కనబడటంలేదు. ఈ చిత్రం మరో వారం రోజుల్లో విడుదల కాబోతోంది. సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెపుతున్నారు.