సెప్టెంబరు 6న రామ్ చరణ్ 'తుఫాన్'... అదుర్స్ అన్న సెన్సార్ మెంబర్స్
మంగళవారం, 3 సెప్టెంబరు 2013 (12:06 IST)
IFM
రామ్ చరణ్ 'ఎవడు' ఎప్పుడొస్తుందో చెప్పలేం కానీ... హిందీలో తీసిన జంజీర్ తెలుగులో 'తుఫాను' ఈ నెల 6న విడుదల చేస్తున్నట్లు స్టేట్‌మెంట్ ఇచ్చేశారు నిర్మాతలు. సెన్సార్ పూర్తయి 'ఎ' సర్టిఫికెట్ పొందింది.
సెన్సార్ సభ్యులు సినిమాను పొగడ్తలతో ముంచెత్తారని ప్రకటనలో తెలియజేశారు. రిలయన్స్, ఫ్లెయింగ్ టర్జిల్స్ సంయుక్తంగా నిర్మించారు. అపూర్వ లఖియా దర్శకుడు. ప్రకాష్‌రాజ్, శ్రీహరి, భరణి, మహీ గిల్ నటించారు.