భగవంత్ కేసరి ఫస్ట్ రివ్యూ ఎలా వుందంటే?

శనివారం, 14 అక్టోబరు 2023 (22:57 IST)
కామెడీ, యాక్షన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెడి, సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించనున్నాడు. భగవంత్ కేసరి మొదటి సమీక్ష ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.
 
 ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ వయొలెన్స్ డోస్ లేదని అంటున్నారు. ఈ సినిమాతో అనిల్ రావిపూడిలో కొత్త దర్శకుడిని చూశామని సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు అనిల్ సినిమాల్లో కామెడీ, ఎమోషన్స్ చూసిన ప్రేక్షకులు భగవంత్ కేసరితో కంటెంట్ డైరెక్టర్‌గా నిరూపించుకుంటారని అన్నారు.
 
భగవంత్ కేసరి సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. డైలాగ్స్, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్‌తో నిండిపోయింది. భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు