బోర్‌ కొట్టిన ప్రేక్షకుడికి రిలీఫ్‌ ఇస్తూ ఇంట్రెస్ట్ కలిగించే చిత్రం విక్రమ్ 'ఇంకొక్కడు'

గురువారం, 8 సెప్టెంబరు 2016 (17:11 IST)
నటీనటులు:
విక్రమ్‌, నయనతార, నిత్యమీనన్‌, నాజర్‌, తంబి రామయ్య, కరుణాకరన్‌, రిత్విక్‌ తదితరులు
 
టెక్నికల్‌ టీమ్‌:
కెమెరా: ఆర్‌డి. రాజశేఖర్‌, సంగీతం: హరీష్‌ జైరాజ్‌, నిర్మాత: శింబు థామిస్‌, నీలం కృష్ణారెడ్డి. (తెలుగు నిర్మాత), కథ, కథనం, దర్శకత్వం: ఆనంద్‌ శంకర్‌.
 
ప్రయోగాత్మక పాత్రలు పోషించడంలో విక్రమ్‌ది ప్రత్యేక శైలి. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ.. చిత్రాలతో తనకంటూ విశిష్టమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి 'ఇరు ముగన్‌ (ఇంకొక్కడు)' పేరుతో సినిమా చేశాడు. రెండు భిన్నమైన పాత్రలు చేశాడు. 'ఐ'లో కూడా రెండు పాత్రలు పోషించి భయపెట్టాడు. 'ఇంకొక్కడు'లో ఎలా ఉంటుందనే ఇంట్రెస్ట్‌ ప్రేక్షకుల్లో ట్రైలర్‌ ద్వారా కలుగచేశాడు. సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్ర పోషిస్తున్నట్లు ముందుగానే తెలియడంతో హాలీవుడ్‌ స్థాయిలో ఉంటుందనే ట్విస్ట్‌ కూడా ట్రైలర్‌ ద్వారా ఇచ్చేశాడు. తమిళ దర్శకుడు ఆనంద్‌ తీసిన ఈ చిత్రం గురువారమే విడుదలైంది. మరి ఏ స్థాయిలో వుందో చూద్దాం.
 
కథ:
మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో కథ మొదలవుతుంది. అక్కడ భారత రాయబార కార్యాలయంలోకి 75 ముసలివ్యక్తి వచ్చి.. శ్వాసకోసం వాడే ఇన్‌హేలర్‌ పీల్చుకుని.. దానిద్వారా వచ్చిన ఎనర్జీతో బీభత్సం సృష్టిస్తాడు. ఆ తర్వాత తనూ చనిపోతాడు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని 'రా' ఆఫీసర్‌గా నాజర్‌ను పంపిస్తుంది. అక్కడ దొరికిన క్లూ ఆధారంగా ఇలాంటివి మాజీ 'రా' ఆఫీసర్‌ అఖిల్‌ వల్లే సాధ్యమవుతుందని నిర్ణయానికి వచ్చి.. అతన్ని పిలిపిస్తాడు. 
 
అఖిల్‌ వచ్చాక.. 'స్పీడ్‌' అనే ప్రేరేపిత డ్రెగ్స్‌ను తయారు చేసే 'లవ్‌' వ్యక్తి పనే అని డిసైడ్ అయి.. తనకు మలేషియా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటేనే లవ్‌ను పట్టుకుంటానని షరతు విధిస్తాడు. దాంతో పై అధికారుల అనుమతితో.. నాలుగేళ్ళ తర్వాత మరలా డ్యూటీ చేస్తాడు. అప్పుడు అతనికి ఎదురైన సవాళ్ళు, సంఘటనలే మిగిలిన సినిమా. ఇందులో నయనతార పాత్ర ఏమిటి. నిత్య పాత్రేమిటి? అనేది తెలుస్తుంది.
 
పెర్‌ఫార్మెన్స్‌:
నటుడిగా విక్రమ్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన కష్టమేమిటో ఇందులో ప్రతి సినిమాలో కన్పిస్తుంది. 'ఐ' సినిమాలో మేకప్‌ కోసమే గంటల తరబడి జంతువులా మారిన విక్రమ్‌ ఇందులో లవ్‌ అనే గే.. గెటప్‌లో నడక, హావభావాలు అన్నీ బాగా చేశాడు. ఇక ఇన్వెస్టిగేట్‌ పోలీసు అధికారిగా గెడ్డంతో, నటనతో మైమరిపించాడు. 50 యేళ్ళయినా ఆయనో ఎనర్జీ లెవల్స్‌ అద్భుతంగా వున్నాయి. అఖిల్‌ భార్యగా నయనతార నటించింది. మైండ్‌ పోయిన తర్వాత ఆమె ఓ రోబోలా చెప్పిందే చేయడం కొత్తగా అనిపిస్తుంది. నిత్యామీనన్‌ అఖిల్‌కు అసిస్టెంట్‌గా చేసింది. పోలీసు అధికారిగా నాజర్‌.. మలేషియా పోలీసుగా కాస్త హాస్యం పండిస్తూ తంబి రామయ్య నటించాడు.
 
సాంకేతిక విభాగం..
ఇటువంటి కథకు సినిమాటోగ్రఫీ కీలకం. మలేషియా, కాశ్మీర్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడం.. ఛేజింగ్‌లు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌... తీయడం సాహసమే.. దాన్ని ఆర్‌.డి.రాజశేఖర్‌ చక్కగా బంధించాడు. ఇక సంగీతపరంగా హరీష్‌ జైరాజ్‌.. బాణీలు గొప్పగాలేవు కానీ.. వినడానికి పర్లేదు. తెలుగులో సాహిత్యం ఉన్న మూడు పాటలన్ని ముగ్గురు రాశారు. పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ వుండదు. డైలాగ్స్‌ సరళంగా వున్నాయి. సన్నివేశపరంగాసాగేవే. ఎక్కడా పంచ్‌లు పేలిపోయే డైలాగ్స్‌ కనిపించవు. దర్శకుడు ఆనంద్‌.. కథనాన్ని బోర్‌కొట్టకుండా చూపించాడు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధాన పాత్ర పోషించింది.
 
విశ్లేషణ: 
రొటీన్‌గా సాంఘిక కథలతో కూడిన చిత్రాలు చూసి బోర్‌ కొట్టిన ప్రేక్షకులకు ఇంకొక్కడు.. రిలీఫ్‌ ఇస్తుంది. హాలీవుడ్‌ సినిమాల్లో చూసే ఇటువంటి కథలను.. దక్షిణాదిలో తీస్తే ఎలా ఉంటుందనేందుకు ఈ చిత్రం నిదర్శనం. ఏవో సన్నివేశాలు అనుకరించినవీ.. కాపీ చేసినవి అనిపించకపోయినా.. కథాపరంగా సాగే సన్నివేశాలు ఇంట్రెస్ట్‌ కల్గిస్తాయి. డ్రెగ్‌ మాఫియా కథలకు మలేషియా అనేది బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది. నిజంగా అక్కడ మాఫియా వుందనేది అందరికీ తెలిసిందే. 
 
అయితే అక్కడ ప్రభుత్వమే వాటిని ప్రోత్సహిస్తూ వాటికోసం పోరాడే ఇండియన్‌ ఆఫీసర్లను ఏవిధంగా ర్యాంగ్‌ గైడెన్స్‌ ఇస్తుందనేది.. కబాలిలో చూపించాడు. ఇలా పలు చిత్రాలు వచ్చినా.. అసలు మలేషియా ప్రభుత్వంలోనే ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ చాలా తెలివిగా లవ్‌ అనే మాఫియాతో ఎలా దేశదేశాలు వాటిని దాటిచేస్తున్నాడనేది ఇంట్రెస్ట్‌గా వుంది. ఇందులో దేశాన్ని కాపాడే మిలటరీ కూడా భాగమైందని పాయింట్‌ ఇంట్రెస్ట్‌.. ఇవన్నీ చూస్తుంటే.. మాఫియాను విశృంఖలానా వ్యాపించడానికి అధికారులు, రాజ్యాంగ యంత్రాగమే నిదర్శనం. దాన్ని ఓ ఇండియన్‌ పోలీసు అధికారి ఎలా చెక్‌ పెట్టానేది ఆసక్తికరం.
 
ఇందులో కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు కూడా ఉన్నాయి.. సైన్స్‌ ఫిక్షన్‌ గనుక.. కొన్ని పదాలు, కొన్ని మందులు ఎలా వాడితో మనిషిలోని కణాలు ఉత్తేజం అవుతాయో కొన్ని వాడితే ఎలా నిర్వీర్యం అవుతాయనే నాలెడ్జ్‌ సామాన్య ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. అసలు డ్రెగ్‌ తీసుకుని దానితో వచ్చిన ఎనర్జీతో యుద్ధాలు చేసే ఆర్మీకూడా ఉందని హిట్లర్‌ కాలంనాటి సంఘటనలు చెప్పడం విశేషం. ఏది ఏమైనా ఇటువంటి ఆసక్తికరమైన కథతో కథనంతో ప్రేక్షకుడిన అలరించాడనే చెప్పాలి. సీరియస్‌ కథ గనుక.. జోకులు వేయడానికి.. ఎంటర్‌టైన్‌మెంట్‌ పాళ్లు తక్కువే. ఇలాంటి కథలు తెలుగులో కూడా వస్తే.. కథలు కొత్త పుంతలు తొక్కుతాయనడంలో సందేహమేలేదు.
 
రేటింగ్‌: 3/5 

వెబ్దునియా పై చదవండి