మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశాడు దర్శకుడు అజయ్ భూపతి.. RX 100 చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు ఇప్పుడు మహాసముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 14 శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి.