మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసీఫర్' చిత్రానికి తెలుగు రీమేక్‌గా 'గాడ్‌ఫాదర్' సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీని.. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై "గాడ్‌ఫాదర్" చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమా గురించి ఓ లేటేస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 'గాడ్‌ఫాదర్' సినిమాలో ఫేమస్ పాపులర్ సింగర్ బ్రిట్నీ స్పియర్‌తో ఓ సాంగ్ పాడించనున్నట్లుగా టాక్. చిరు సూచన మేరకు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఒక పాట కోసం బ్రిట్నీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. బ్రిట్నీ అమెరికా పాప్ సింగర్.. ప్రపంచవ్యాప్తంగా ఈమెకు అభిమానులున్నారు.