వరుస విజయాలతో దూసుకెళుతోన్న శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం పడి పడి లేచె మనసు. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రంపై ఫస్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఈరోజు పడి పడి లేచె మనసు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. మరి.. ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంది. హనుకి విజయాన్ని అందించిందా..? లేదా.? అనేది చెప్పాలంటే ముందుగా కథ చెప్పాల్సిందే.
కథ - సూర్య రావిపాటి (శర్వానంద్) ఫుట్‌బాల్ ప్లేయర్. వైశాలి (సాయి పల్లవి) మెడికల్ స్టూడెంట్. వీళ్లు కలకత్తాలో సెటిలైన తెలుగువారు. వైశాలిని చూసిన తొలిచూపులోనే సూర్య ప్రేమలో పడతాడు. రెండేళ్లు ఆమె వెంట తిరుగుతాడు. ఆఖరికి ఆమెను ప్రేమలో పడేస్తాడు. వైశాలి మెడికల్ క్యాంప్ కోసం నేపాల్‌లోని ఖాట్మండుకు వెళుతుంది. ఆమెను చూడకుండా ఉండలేని సూర్య అక్కడకి కూడా వెళతాడు.
అయితే.. తనని అంతలా ప్రేమిస్తున్న సూర్యను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెళ్లి చేసుకుందాం అని సూర్యతో చెబుతుంది. వైశాలిని ఎంతగానో ప్రేమించిన సూర్య వైశాలితో పెళ్లి చేసుకోను అని చెబుతాడు. అంతే.. వైశాలి షాక్ అవుతుంది. సూర్య అలా చెప్పడానికి కారణం ఏమిటి..? అసలు సూర్య గతం ఏమిటి..? వీరి జీవితాల్లో ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగిలిన కథ.
పాత సినిమాలు గుర్తుకు రావడం
విశ్లేషణ - శర్వానంద్ సూర్య పాత్రలో పాత్రకు తగ్గట్టుగా చాలా బాగా నటించాడు. ఇక సాయిపల్లవి నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసం లేదు. వైశాలి పాత్రలో చాలా నేచురల్‌గా నటించింది. ఈ ప్రేమకథకు కలకత్తా బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం బాగుంది కానీ.. కథను తెరకెక్కించడంలో డైరెక్టర్ హను కన్ఫ్యూజ్ అయ్యాడనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ తను కన్ఫ్యూజ్ అవుతూ.. ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటుంది. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ, సంభాషణలు బాగున్నాయి.
వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సునీల్ కామెడీ బాగుంది. సినిమా చూస్తుంటే.. స్టార్ట్ అయి చాలాసేపు అయ్యింది ఇంకా ఇంటర్వెల్ రాలేదంటి అనిపిస్తుంటుంది. సెకండాఫ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎండ్ టైటిల్స్ పడటం లేదేంటి అనిపిస్తుంటుంది. నిడివి కొంచెం తగ్గించుంటే బాగుండేది. ట్విస్టులు ఎక్కువ ఉంటే ఆడియన్స్ సర్‌ఫ్రైజ్ ఫీలవుతారు అని పెట్టినట్టుగా అనిపిస్తుంటుంది. అలా కాకుండా.. కథను సింపుల్‌గా చెప్పుంటే బాగుండేది. అక్కడక్కడా బోర్ కొడుతుంటుంది. టోటల్‌గా చెప్పాలంటే... యావరేజ్ మూవీ.