కొంతమంది యూత్ కు కనువిప్పు కలిగించే పేకమేడలు - రివ్యూ

డీవీ

శుక్రవారం, 19 జులై 2024 (11:53 IST)
Vinod Kishan Anusha Krishna
నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు 
 సాంకేతికత: కెమెరా: హరిచరణ్ కే ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ మ్యూజిక్: స్మరణ్ సాయి లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్, రచన, దర్శకత్వం: నీలగిరి మామిళ్ల,  నిర్మాత: రాకేష్ వర్రే  రిలీజ్ డేట్: 2024-07-19
 
కథగా చెప్పాలంటే...   బీటెక్ చేసిన లక్ష్మణ్ (వినోద్ కిషన్) పనిదొంగ. కష్టపడేతత్త్వం కాదు. సిటీలో రియల్ ఎస్టేట్ ఉద్యోగిగా చేస్తున్నట్లు నమ్మించి తెలంగాణలోని ఓ గ్రామంలోని అమ్మాయిని పెండ్లి చేసుకుంటాడు. ఉన్నపళంగా కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటాడు. మాటకారి కావడంతో  పెండ్లయిన ఎన్.ఆర్.ఐ. మహిళతో ఏర్పడిచిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. 
 
భార్య వరలక్ష్మీ (అనూష కృష్ణ) సంపాదనతో ఆన్‌లైన్‌లో పేకాట అడుతూ.. రియల్ ఎస్టేట్‌లో కోట్లు సంపాదించాలని గాలి మెడలు కడుతుంటాడు. ఆ క్రమంలో అతని వివాహేతర సంబంధం బెడిసికొట్టడంతో రోడ్డున పడతాడు. అయినా మారడు. భర్త ప్రవర్తనతో విసుగెత్తి ఓ పెద్దాయన సాయంతో కర్రీ పాయింట్ పెడుతుంది. అక్కడ కూడా ఆమె భర్త రసాభసా చేసి భార్యను దూరం చేసుకుంటాడు. ఆ తర్వాత కథ ఎటువైపు మళ్లింది? అనేది సినిమా.
 
 సమీక్ష:
పేకమేడలు కథ జరిగిన సంఘటన ఆదారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లేబర్ బస్తీలోని కుటుంబాల కథను కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. పనిచేయని భర్త, పనిచేసి కుటుంబాన్ని సాకే భార్య కథ ఇది. ఈ తరహాలో పలు కథలు వచ్చినా పక్కా తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. బస్తీ జీవితం, అక్కడ ఉండే వ్యక్తుల హావభావాలు, మనస్తత్వాలను బాగా తన పాత్రల్లో చూపించే ప్రయత్నం చేశారు. 
 
మొదటి భాగం సాఫీగా సాగుతూ ద్వితీయార్థంలో కేవలం భార్య భర్త మధ్య వుండే స్ట్రగుల్స్ చూపించారు. ఇందులో హీరో పాత్ర కన్నా హీరోయిన్ పాత్ర కీలకమైంది. మహిళా తన కాళ్ళ మీద తాను నిలబడేలా ఏ విధంగా ముందడుగు వేసింది చేసిన ప్రయత్నం అభినందనీయం. 
 
ఇందులో హీరోయిన్లు తెలుగువారు కాకపోయినా భార్య భర్తల మధ్య ఎమోఫన్స్ ను కుటుంబాల మధ్య సంబంధాలను దర్శకుడు బాగా చూపించాడు. క్లయిమాక్స్ కు ముందు ఇద్దరి మధ్య జరిగే తగాదా చిత్రానికి కీలకం. అది బాగా హైలైట్ చేశాడు దర్శకుడు. వారూ బాగా నటించారు. నా పేరు శివ సినిమాలో అమ్మాయలు భయపటేవిధంగా నెగెటివ్ పాత్ర పోషించిన వినోద్ కిషన్ ఇందులో అంతకంటే భయపెట్టేవిధంగా నటించాడు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు నటించారు. అనూష తన నటనతో మెప్పించింది.
 
 సాంకేతికపరంగా చెప్పాలంటే.. రైటింగ్ పరంగా నీలగిరి రాసుకొన్న కొన్ని సీన్లు సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చాయి. సృజన అడుసుమిల్లి, హంజా అలీ ఎడిటింగ్ బాగుంది. నేటివిటి, కంటెంట్ ప్రధానంగా సాగే చిత్రాన్ని నిర్మించిన విధానం చూస్తే.. సినిమాపై దర్శక నిర్మాతలకు ఉండే తపన కనిపిచింది. గ్రామీణ, బస్తీ మాత్రుక సినిమాలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పవచ్చు. చిన్న పాయింట్ తీసుకుని రెండు కుటుంబాల మధ్య అల్లిన కథను దర్శకుడు డీల్ చేసే విధానం బాగుంది. ఇప్పటియూత్ లో చాలామందికి కనెక్ట్ అయ్యే చిత్రంగా చెప్పవచ్చు. ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.
రేటింగ్ : 3/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు