చిరంజీవి ఫ్యామిలీని వచ్చిన నటులు అంతా కుర్రాళ్ళ కాబట్టి.. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, చిరంజీవి, పవన్‌ను అనుకరించే స్టెల్స్‌తో ముందుకు వస్తున్నారు. సాయిధరమ్ తేజ్.. ఆహార్యంలోనూ అనుకరణలోనూ పవన్‌ను పోలినా.. మధ్యమధ్యలో చిరంజీవిని ఇమిటేట్‌తో డాన్స్‌లు చేస్తూ ఫర్వాలేదనిపిస్తున్నాడు. అలాంటి కోవలోనిదే గురువారం విడుదలైన సినిమా 'సుప్రీమ్'. గతంలో ఇదే టైటిల్‌తో చిరంజీవి, రాధ జంటగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా జోడీగా నటించారు. అనిల్‌రావిపూడి 'పటాస్' తర్వాత దర్శకత్వం వహించిన సినిమా ఇదే. అదెలా ఉందో చూద్దాం.
కథ:
అనంతపురంలో రాజవంశీయుల ప్రజలకు ఇచ్చిన వేల ఎకరాల భూమి ప్రస్తుతం జాగృతి ట్రస్ట్ నిర్వహిస్తుంది. అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని వేలమంది జీవితాలు బతుకుతుంటాయి. సాయికుమార్ తదితరులు దాన్ని కాపాడుకుంటూ వస్తుంటారు. అయితే దానిపై రాజకీయనాయకుల అండతో విక్రమ్ సర్కార్ (కబీర్ సింగ్) కాజేయాలని చూస్తాడు. ఆ భూములన్నీ తనవేనని డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సబ్‌మిట్ చేస్తాడు. కానీ అసలు వారసుడు వేరే ఉన్నారని.. సాయికుమార్ చెప్పడంతో కోర్టు ఓ నెలరోజుల గడువు ఇస్తుంది వారికి.
మరోవైపు.. టాక్సీ నడిపే సాయిధరమ్ తేజ్‌కు అనాథగా వుండే రాజన్ అనే పిల్లాడు తారసపడతాడు. అతన్ని తీసుకువచ్చి తన వద్దే పెట్టుకుంటాడు. అలాంటి పిల్లాడు తనకు ఇక్కడ బోర్‌కొట్టిందని వేరే చోటకు వెళుతున్నట్లు కాగితం రాసి వెళ్ళిపోతాడు. అతన్ని వెతుకుతుండగా.. ఒరిస్సాకు చెందిన ఓ గ్యాంగ్ అతని పట్టుకుపోతుంది. ఈ పిల్లాడి కోసం వెతుక్కుంటూ సాయికుమార్ కూడా అక్కడికే వస్తాడు. వారిద్దరి సమక్షంలో కిడ్నాప్ అయిన కుర్రాడు కోసం అంతా గాలింపు చేపడతారు. చివరికి సాయిధరమ్ తేజ్ అతన్ని కనిపెట్టి.. అనంతపురం కోర్టు తీర్పు రోజుకు ఎలా తీసుకెళ్ళాడు అనేది సినిమా.
పెర్‌ఫార్మెన్స్:
నటీనటులపరంగా అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాయిధరమ్ తేజ్ స్పీడ్ నటన, డాన్స్ అన్నీ యూత్‌ను ఆకట్టుకుంటాయి. పోలీసు ఇన్‌స్పెక్టర్ బెల్లం శ్రీదేవిగా రాశీఖన్నా నటించింది. తను సిన్సియర్ కోసం చేపే పనులు ఎంటర్‌టైన్ చేస్తాయి. ఆమె తండ్రిగా రఘుబాబు ఇతరత్రా గణం బాగానే నటించారు. సాయికుమార్ ఓకే. రాజేంద్రప్రసాద్ హీరో తండ్రిగా నటించాడు. ఇందులో ప్రత్యేకంగా చెప్పాలింది.. ప్రభాస్ శ్రీను, పృథ్వీ పాత్రలు. ఖరీదైన కార్లను దొంగతనం చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తారు. జింగ్‌జాంగ్.. అంటూవాడే ఊతపదం ఆకట్టుకుంటుంది. ప్రదాన విలన్‌గా కబీర్, అతని అనుచర విలన్‌గా రవికిషన్ సరిపోయారు. మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్‌గా బజర్దస్త్. టీమ్‌ను కూడా తీసుకున్నారు.
టెక్నికల్‌గా:
సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు. రీమిక్స్ 'అందం హిందోళం..'లో ట్యూన్ చెడకుండా జాగ్రత్తగా చేశాడు. సంభాషణలపరంగా అనిల్ రాపూడి ప్రాసలకు ప్రాధాన్యత ఇచ్చాడు. తను బేసిక్‌గా రచయిత కావడంతో రెండింటికి న్యాయం చేయగలిగాడు. దర్శకత్వంలో ఎక్కడా బోర్ అనిపించలకపోయినా.. కొన్ని అనవసరం సన్నివేశాలు కూడా కొనసాగింపుగా చేయగలిగాడు. ఎడిటింగ్ విషయంలో యాక్షన్ సీన్లు కొంత తగ్గిస్తే బాగుండేది.
విశ్లేషణ:
కథ ఏమీ కొత్తదికాదు. పాతకాలంనాటి కథే. దాన్ని ఇప్పటి తరంతో తీస్తే ఎలా వుంటుందనేది చేసిన ప్రయత్నం ఇది. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది. కారుదొంగతనాలు చేసే పృథ్వీ, శ్రీనులు ఎపిసోడ్. అదేకాకుండా క్లెమాక్స్‌లో దివ్యాంగులు (వికలాంగులు) చేసే యాక్షన్ ఎపిసోడ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. లింక్‌పరంగా ముందు ఓ సీన్‌పెట్టి.. దాన్ని క్లెమాక్స్‌లో కలిపిన విధానం బాగుంది.
ఆలోచించే ఆకట్టుకునే మాటలున్నాయి. గతాన్ని మర్చిపోవడానికి ఒక్కరాత్రి తాగితే సరిపోతుందనుకుంటే.. బతుకంటే ఏమిటనేది ఒక్కరాత్రే తెలిసిదంటూ.. సన్నివేశపరంగా వచ్చేవి పేలాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది.. రాజన్ అనే పాత్ర. పిల్లాడి పాత్ర. తను ముంబైకు చెందిన నటుడు. ఎన్‌ఆర్‌ఐగా బాగా సరిపోయాడు. చిత్రంలో పిల్లాడి పాత్రే కీలకం. రూ.వేల కోట్ల భూములకు వారసుడు తనే. అలాంటివాడు అనాథగా.. బతికే సీన్ వచ్చినప్పుడు దర్శకుడు సెంటిమెంట్‌ను బాగా ఉపయోగించుకున్నాడు. ఇలా ప్రతి సన్నివేశాన్ని సెంటిమెంట్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే ముందు చేసిన 'పటాస్' మల్లే ఇది ఎంటర్‌టైన్‌మెంట్ అయినా.. యాక్షన్ బాగానే వుంది.
ప్రతి సినిమాలో యాక్షన్ ఓవర్‌గా ఉంటుంది. ఇందులోనూ అలానే వుంది. అయితే కొన్ని చోట్ల లాజిక్కులు వుండవు. తండ్రి తాగుబోతు. కొడుకు టాక్సీ తొలి సంపాదిస్తున్నాడు. ఒకప్పుడు బాగా ఉన్నవాడని చెబుతాడు. జాగృతి సంస్థవారసులమో అనే బిల్డప్ ఇస్తాడు. కానీ తర్వాత అతనెవరేది చెప్పరు. ఏదో కథను నడిపేపాత్రగా రాజేంద్రప్రసాద్ పాత్ర వుంది. ఇక బాణీలపరంగా కొత్తగాలేకపోయినా.. వినడానికి బాగున్నాయి.
సినిమా అనేది వినోదం కోసం. దానికోసం ఎన్ని చేసైనా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలి. ఈ లాజిక్కుతో బోర్‌కొట్టకుండా దర్శకుడు చూపిన విధానం బాగుంది. వారసుడిగా.. సినిమాను చెడకుండా సాయిధరమ్ తేజ్ నటన చూపించాడు. అయితే.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పర్చుకోవాలి. ఇక దర్శకుడిగా రెండో సినిమాను అలరించే ప్రయత్నం చేశాడు. ఫ్యాన్స్‌తోపాటు ఎంటర్‌టైన్ కోరుకునేవారికి సరదాగా సాగే సినిమా.