సమకాలీన రాజకీయ వ్యవస్థపై ఎక్కుపెట్టిన షారూఖ్‌ ఖాన్‌ అస్త్రం జవాన్‌ - రివ్యూ

గురువారం, 7 సెప్టెంబరు 2023 (17:15 IST)
Shah Rukh Khan, Jawan
నటీనటులు: షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు, రిద్ధి డోగ్రా, అస్తా అగర్వాల్, సంజీత భట్టాచార్య, సంజయ్ దత్ తదితరులు.
 
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ: జీ.కె. విష్ణు, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాతలు: గౌరీ ఖాన్, దర్శకుడు : అట్లీ,సహా నిర్మాత : గౌరవ్ వర్మ, ఎడిటర్: రూబెన్
 
పఠాన్‌తో తర్వాత   ‘షారుఖ్ ఖాన్’ కింగ్ సైజ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పడు అట్లీ దర్శకత్వంలో ఈరోజు  జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమాను మహేష్ బాబు తో కలిసి చూడాలనుందని షారుఖ్ ఖాన్  ఎందుకన్నాడో తెలియాలంటే సినిమా లోకి వెళ్లాల్సిందే. 
 
కథ:
షారూఖ్‌ ఖాన్‌ ద్విపాత్రాభినయం చేసిన కథ ఇది. పెద్ద షారూఖ్‌ఖాన్‌ ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తుండగా గన్స్‌ కాంట్రాక్టర్‌ వ్యాపారవేత్త విజయ్‌సేతుపతితో ఒప్పందం చేసుకుంటాడు. కానీ ఆ గన్స్‌ నాసిరకం కావడంతో పెద్ద షారూఖ్‌ఖాన్‌ విజయ్‌సేతుపతితో కాంట్రాక్ట్‌ కాన్సిల్‌ చేస్తాడు. దాన్ని అవమానంగా భావించిన విజయ్‌సేతుపతి పెద్ద షారూఖ్‌పై ఎటాక్‌ చేసి చంపిస్తాడు. అలా చంపిన ఆ బాడీ నదిలో కొట్టుకుంటూ పోయి సిక్కిం బోర్డర్‌కు చేరుతుంది. అదే టైంలో పెద్ద షారూఖ్‌ ఖాన్‌ భార్య దీపిక పదుకొనేపైన కూడా ఆమె ఇంట్లో కొంత డబ్బుపెట్టి దేశద్రోహం నేరం మోపుతారు. ఇది గ్రహించిన ఆమె ఇంటికి వచ్చినవారిని చంపేస్తుంది. దాంతో ఆమెపై కూడా దేశద్రోహం కేసు నమోదు అవుతుంది.

ఆ టైంలో దీపిక గర్భవతికావడంతో ఉరిశిక్ష వాయిదా వేసి అక్కడ లేడీ ఆఫీసర్‌ దీపికకు పుట్టిన బిడ్డను దత్తత తీసుకుంటుంది. అలా అక్కడే పెరిగిన అజాద్‌కు (చిన్న షారూఖ్‌ఖాన్‌) విద్యాబుద్ధులు నేర్పించి అతన్ని జైలర్‌గా మారుస్తుంది. ఆ తర్వాత ఈ జైలర్‌ దేశంలోని ద్రోహులను శిక్షించే క్రమంలో కొంతమంది టీమ్‌ను తయారుచేసుకుని శిక్షిస్తుంటాడు. ఇలా చేసిన వారిని పట్టుకునేందుకు పై నుంచి ఓ ఆఫీసర్‌గా నయనతార వస్తుంది. కానీ ఆజాద్‌ను చూసి ప్రేమించి పెండ్లి చేసుకుంటుంది. అప్పటికే ఆమెకు ఓ బిడ్డకూడా వుంటాడు. కానీ ఫస్ట్‌నైట్‌ రోజు ఆజాద్‌ గురించి నయనతారకు తెలుస్తుంది. అనంతరం కథ ఎటువైపు మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ సినిమా కథకు దర్శకుడు దక్షిణాది దర్శకుడు అట్లీ కావడంతో పలు సినిమాలు గుర్తుకువస్తాయి. బాలీవుడ్‌లో ఇలాంటివి కొత్తకాకపోయినా వినూత్నంగా తీశాడు. ఈ సినిమాలో రైతు ఆత్మహత్యలు, వేలకోట్లు ఎగ్గొట్టిన వ్యాపారవేత్తను ఏమీ చేయలేని ప్రభుత్వాన్ని, బ్యాంక్‌లను వేలెత్తిచూపడం, రైతు 40వేలు కట్టలేని స్తితిలో వుంటేవాడిని టార్గెట్‌ చేయడం వంటివి ఆలోచించేవిధంగా సెటైర్‌గా బాణాలు సందించాడు దర్శకుడు. తెలుగులోనూ మహేష్‌బాబు సర్కారువారిపాట సినిమా ఛాయలూ కనిపిస్తాయి. అందుకే మహేష్‌బాబుతో కలిసి సినిమా చూడాలని షారూఖ్‌ అన్నట్లుగా ఈ చిత్రం చూశాక అనిపిస్తుంది.
 
ఇదే కాకుండా మంత్రులు, రాజకీయనాయకులు చేసే అవీనితి అక్రమాలను ప్రశ్నించాడు. ముఖ్యంగా సమాజాన్ని చైతన్యం చేసేవిధంగా ఈ కథలో ఓ పాయింట్‌ కూడా పెట్టాడు. దోమల్ని చంపడానికి సరైన టార్టాయిస్‌ మంచిదోకాదో పరిశీలిస్తాం. అలాంది దేశాన్ని 5 ఏళ్ళు పాలించే వారు మంచివాడు కాదా? లేదా? అనేది ఎందుకు ఆలోచించమని ప్రజల్ని మోటివేట్‌ చేశాడు. ఇలా ఒక్కటికాదు పలు సమస్యలను చూపిస్తు ప్రజల్ని ఆలోచించమని అంటాడు. 
 
ఇక పెద్ద షారూఖ్‌ ఖాన్‌ సిక్కింలోని ఓ కుగ్రామంలో బతికి వుండి గతాన్ని మర్చిపోతాడు. అలాంటి వాడిని ఎలా తిరిగి జైలర్‌ దగ్గరకు తీసుకువచ్చాడు అన్నది ఆసక్తికరంగా వుంది. దీనికితోడు సంజయ్‌దత్‌ ఎంట్రీ కూడా ఆసక్తికరంగా వుంటుంది. ఇలా గతంలో కమల్‌ నటించిన విక్రమ్‌, రజనీకాంత్‌ నటించిన జైలర్‌ సినిమాలో పలువురు హీరోలు నటించి సన్నివేశపరంగా హీరోకు ఎలా హెల్ప్‌ అయ్యారో ఈ జవాన్‌లోకూడా అలానే వుంటుంది. కాకపోతే అట్లీ స్క్రీన్‌ప్లే కొత్తగా వుంటుంది.
 
ఇందులో నటించిన పాత్రదారులు అందరూ బాగా నటించారు. అందరినీ షారూఖ్‌ ఖాన్‌ నటన మింగేసిందనే చెప్పాలి. అంతలా లీనమై మురిపించాడు. ప్రియమణి, సానిమా మల్హోత్రా వంటివారు బాగా నటించారు. 
 
తండ్రి దేశద్రోహి, కొడుకు తండ్రిపై పడ్డ మచ్చను ఎలా చెరిపేశాడు అనేది తెలుగువారికి పరిచయమైన కథలే. బాలీవుడ్‌లో ఈ సినిమాను షారూఖ్‌ అభిమానులు పండుగ చేసుకునేలా వుంది. దర్శకుడు అట్లీ కనుక సౌత్‌ ఫ్లేవర్‌ అంతా కనిపిస్తుంది.
 
ఇందులో ప్రధానంగా ఓటు వేసే ఇవిఎం. మిషన్‌ను తీసుకువచ్చి జైలులో పెట్టుకుంటాడు. అలా వాటిని తమ కంట్రోల్‌ చేసుకుని దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునేవారిని ఏవిధంగాబుద్ధి చెప్పవచ్చో కొత్త ఐడియా దర్శకుడు ఇచ్చాడు. టెక్నికల్‌ పరంగా అన్నీ విషయాలు బాగున్నాయి.
 
ఫైనల్‌గా జైలర్‌ సమాజాన్ని మార్చినట్లు చూపించాడు. క్లయిమాక్స్‌లో జైలర్‌ టీమ్‌ అంతా ఫారిన్‌లో వుండేవిధంగా చూపించాడు. ఈసారి స్విస్‌బ్యాంక్‌లపై కన్నేసినట్లుగా ట్విస్ట్‌ ఇచ్చి సీక్వెల్‌గా రావచ్చు అనే హింట్‌ కూడా ఇచ్చాడు. ఈ సినిమా ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేసే సినిమాగా చెప్పవచ్చు.
 
పైనల్‌గా జౌలర్‌ అందరినీ మార్చినట్లు చూపిస్తాడు. చివరగా అంరదినీ ఫారిన్‌ కంట్రీలో చూపిస్తాడు. బహుశాసీక్వెల్‌గా వుంటుందని ట్విస్ట్‌ ఇచ్చాడు. అందులో స్విస్‌బ్యాంక్‌మీద కన్నేసి నట్లుగాచూపించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు