వెరైటీ కథతో విక్రాంత్ స్పార్క్ లైఫ్ - రివ్యూ

శుక్రవారం, 17 నవంబరు 2023 (17:08 IST)
SPARK
విక్రాంత్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ‘స్పార్క్ లైఫ్’. మెహ‌రీన్, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్స్‌. ఈ చిత్రానికి క‌థ‌ను అందిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు విక్రాంత్‌. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై లీల ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడే ఈ చిత్రం రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ..
సిటీలో మెడికోగా వున్న జై (విక్రాంత్) కొందరి అమ్మాయిలను తెలీకుండా ఫాలో చేస్తుంటారు. వారు కాసేపటికి సైకోలా బిహేవ్ చేస్తూ  ఒక్కొక్కరుగా చనిపోతుంటారు.  ఓ సందర్భంలో పోలీసులు జై ను అనుమానించి అరెస్ట్ చేస్తారు. ఈ క్రమంలో అతను ప్రేమించే రుక్స‌ర్ థిల్లాన్  కూడా మరణిస్తుంది. ఆ తర్వాత మెహ్రిన్ వంతు అని తెలుసుకున్న ఆమె తండ్రి జైకు దూరంగా వుండమని చెబుతాడు. ఆ తర్వాత అసలేం జరిగింది? అనేది మెహ్రిన్ కు వివరిస్తాడు జై. జైకు ఆర్య అనే మరో పేరు కూడా వుంటుంది. ఇలా ఎందుకు రెండు పేర్లు వున్నాయి. అమ్మాయిలంతా సైకోలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వీటి వెనుక దాగి వున్న రహస్యం ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష
ఈ కథ వైజాగ్, హైదరాబాద్, ఢిల్లీ, ట్రైబల్ ఏరియాల చుట్టూ సాగుతుంది. ఈ చిత్రంలోని సరి కొత్త పాయింట్  అమెరికాలో జ‌రిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూసి క‌థ‌ను విక్రాంత్  రాసుకున్నాడు.  మొదటి భాగమంతా కథలోని టిస్ట్ ఏమీ అర్థంకాదు. హీరో హీరోయిన్ల చుట్టూ లవ్ ట్రాక్ తోపాటు హత్యలు జరగడం వరకు చూపించాడు.  సెకండాఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది. అధి చాలా కీలకమైంది. ఆర్మీ డాక్టర్ టెర్రరిస్టులపై చేసే ప్రయోగాలవల్ల ఇలా అంధరూ చనిపోతున్నారంటూ సరికొత్త క్లూ ఇచ్చాడు. అదంతా చూస్తే జాంబిరెడ్డి సినిమాకు మరో కోణంగా వుంటుంది.
 
- ఎదుటి మనిషిలోని మెదడును కంట్రోల్ చేసే ప్రయోగంతో దేశంలోని ఉగ్రవాదుల్ని మన కంట్రోల్ లో తీసుకోవచ్చనే సరి కొత్త పాయింట్ చెప్పాడు. ఇటువంటి భారీ కథకు భారీ హీరో అయితే సినిమా వేరేలా వుండేది. కొత్త వాడైనా విక్రాంత్ అన్ని  బాధ్యతలు మోయడంవిశేషమే. తాను అనుకున్నది తీసి చూపించాడు. ఈ క్రమంలో కొంత లాజిక్ మిస్ అయినట్లుగా కనిపిస్తుంది.
 
- హీరో కొత్తవాడు కావడంతో ఇంకాస్త నటనను మెరుగు పర్చుకోవాలి. మిగిలి నటీనటులు  నాజ‌ర్‌, సుహాసిని, బ్ర‌హ్మాజీ, షాయాజీ షిండే, ల‌హ‌రి వారి పరిధి మేరకు నటించారు.  కీలక పాత్రను గురు సోమ‌సుంద‌రంగా అద్భుతంగా చేశారు. టెక్నికల్ గా  అశోక్ కుమార్‌గారు వండ‌ర్‌ఫుల్ విజువల్స్‌ను ఇచ్చారు. సంగీతం, పాటలు బాగున్నాయి. చాలా రిచ్ గా నిర్మాణ విలువలతో రూపొందించారు.
 
- ఇటువంటి సీరియస్ కథను మరింత కసరత్తు చేసి తీస్తేబాగుండేది. భారీ కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్ తో తీసిన ఈ సినిమా ఓటీటీకి మంచి ఫార్మెట్. ఈమధ్య రొటీన్ గా వస్తున్న తెలుగు సినిమాలకు భిన్నంగా వుంది. ఓ దశలో జాంబిరెడ్డిని గుర్తుకు చేస్తుంది. ఏది ఏమైనా మిలట్రీలో జరిగే సరికొత్త విధానాలు ఈ చిత్రం ద్వారా తెలియజపరిచారు. ఇటువంటి కథను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.
రేటింగ్ - 2.75/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు