ఆదిపురుష్‌ టీజర్ చూశాక చిన్నపిల్లాడిన‌య్యాః ప్రభాస్

గురువారం, 6 అక్టోబరు 2022 (20:52 IST)
prabhas latest
prabhas latest
ఆదిపురుష్ సినిమా టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లో ఈరోజు రాత్రి 8గంట‌ల త‌ర్వాత విడుద‌ల చేశారు. ప్ర‌భాస్‌తోపాటు నిర్మాత‌లు భూష‌ణ్ కుమార్‌, ద‌ర్శ‌కుడు ఓంరౌత్‌, దిల్ రాజు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ 3డి ఫార్మెట్‌లో తెలుగు టీజ‌ర్‌ను వీక్షించారు. అనంత‌రం చిత్ర యూనిట్‌తోపాటు చూసిన‌వారంతా క‌ర‌దాళ‌ధ్వ‌నులు చేశారు.
 
ప్ర‌భాస్ మాట్లాడుతూ, నేను ఫ‌స్ట్ టైమ్ త్రీడీ చూశాక చిన్న‌పిల్ల‌వాడి న‌య్యాను. విజువ‌ల్స్‌, జంతువులు మొహంమీద రావ‌డం థ్రిల్ గురిచేసింది. రేపు ఫ్యాన్స్ కోసం 60 థియేట‌ర్ల‌లో  త్రీడీ టీజ‌ర్‌ను వేస్తున్నాం. వారే మాకు స‌పోర్ట్‌. వారు ఎలావుందో చూసి చెప్పాలి. ఈ టెక్నాల‌జీ ఇండియాలో ఫ‌స్ట్ టైమ్ పెద్ద తెర‌పైకి వ‌స్తోంది. మ‌రో కొత్త‌ కంటెంట్‌తో మీ ముందుకు వ‌స్తాం. చూసి మంచి రివ్యూలు ఇవ్వండి అని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు