కార్తి విడుద‌ల చేసిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్‌జీ) ట్రైల‌ర్

శనివారం, 12 జూన్ 2021 (12:38 IST)
In The Name Of God
తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్‌జీ) జూన్ 18న విడుద‌లవుతుంది. ప్రియ‌ద‌ర్శి, నందినీ రాయ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. విద్యాసాగ‌ర్ ముత్తు కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సురేష్ కృష్ణ నిర్మించారు. ఈ అవెయిటింగ్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను శ‌నివారం తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన స్టార్ హీరో కార్తి విడుద‌ల చేశారు. 
 
ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్‌జీ)డ్ వెబ్ సిరీస్‌ చ‌క్క‌టి విజువ‌ల్ ట్రీట్‌గా, రా కంటెంట్‌, ఎమోష‌న్స్‌, డ్రామా, యాక్ష‌న్, చ‌క్క‌టి డైలాగ్స్ క‌ల‌బోత‌గా  ఉంది. ఆది(ప్రియ‌ద‌ర్శి) అనే ప్ర‌మాద‌క‌ర‌మైన యువ‌కుడి క‌థే. మీనా(నందినీ రాయ్‌) అనే అమ్మాయితో ఆది రిలేష‌న్ ఏంటి?  జీవితంలో అత‌ను ఎదుర్కొన్న ఎత్తుప‌ల్లాలేంటి? అనే విషయాలు ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌పై మరింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.
 
‘1 నేనొక్క‌డినే’, ‘స్వామి రారా’, ‘హండ్రెడ్ ప‌ర్సెంట్ ల‌వ్’ వంటి చిత్రాల‌తో పాటు అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’కు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్న కార్తీక శ్రీనివాస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్‌జీ)కు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమోలు, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు విడుద‌లైన ఈ ట్రైల‌ర్ ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతోంది.  ఆహా ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ తో పాటు 2021లో విడుద‌లైన క్రాక్‌, నాంది, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబి రెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, కాలా, రీసెంట్‌గా విడుద‌లైన అర్ధ శ‌తాబ్దం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా నిలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు