ట్రైలర్ కంటే ముందే విడుదలైన రకిట రకిట, బుజ్జి, మరియు ఇటీవల విడుదలైన రొమాంటిక్ సాంగ్ నేతూ శ్రోతల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ పాట రిధమ్, బీట్స్ శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. రికట రకిట సాంగ్‌కు లిరిక్స్ అందించడంతో పాటుగా ఈ పాటను ధనుష్ పాడారు. ఈ సినిమాకు సంతోష్ నాయరణన్ అందించిన సంగీతం సూపర్భ్ అనే చెప్పాలి. జగమే తంతిరం సినిమా నుంచి మూడు పాటలకే వస్తేనే ఊగిపోయిన శ్రోతలు ఇప్పుడు ఈ సినిమా ఎంటైర్ ఆల్భమ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణం రానే వచ్చింది. ప్రముఖ సోనీ మ్యూజిక్ సంస్థ ప్రేక్షకుల ముందకు తీసుకు వస్తున్న జగమే తంతిరం ఈ జ్యూక్ బ్యాక్స్‌లో 8 పాటలు ఉన్నాయి. ఈ ఎనిమిది పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉండబోతుండటం విశేషం. సో...జగమే తంతిరం పాటలను లూప్‌లో పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాందించేందుకు ప్రేక్షకులు రెడీ అయిపోండి. సురలి (జగమే తంతిరం చిత్రంలోని ధనుష్ పాత్ర)కు విజిల్స్, చప్పట్లతో గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పండి.
జగమే తంతిరం మ్యూజిక్ ఆల్భమ్ లాంచ్ సందర్భంగా సోనీ మ్యూజిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రజత్ కక్కర్ మాట్లాడుతూ- . ధనుష్, కార్తీక్ సుబ్బరాజు, సంతోష్ నారాయణన్ వంటి ప్రతిభావంతులు కలిసి చేసిన ఈ సినిమా మాకు ఎంతో స్పెషల్. ఓ మ్యాజికల్ ప్రాజెక్ట్. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఏపీ ఇంటర్‌నేషనల్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ సంస్థలతో అసోసియేషన్ మాకు ఎప్పుడూ సంతోషకరమే. భవిష్యత్‌లో కూడా వారితో కలిసి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయటం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం అని అన్నారు.
సంతోష్ నారాయణన్ మాట్లాడుతూ, పాటల కోసం మ్యూజిక్ స్టూడియోలో ఎంతో టైమ్ స్పెండ్ చేశాం. ఈ ఆల్భమ్‌లోని ప్రతి సాంగ్ కొత్తగా ఉండేలా ప్రయత్నించి సఫలమైయ్యాం. నాకు అవసరమనిపించిన ప్రతి చోట ఓ సరికొత్త సంగీతాన్ని అందించాను. ఈ సినిమాకు సంగీతం సమకూర్చడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. రకిట పాట విడుదలైనప్పుడు ఈ పాట మనలోని ఒత్తిడిని తగ్గించేలా స్ట్రెస్ బస్టర్‌గా బాగా ఉందని చెబుతుంటే హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు సోనీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి జగమేతంతిరం లోని మొత్తం పాటలను విడుదల చేయనుంది. రకిట పాటకు దక్కిన స్పందనే ఈ సినిమాలోని అన్ని పాటలకు దక్కుతుందని నమ్ముతున్నాను అని అన్నారు.