స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ ఎవ‌రు? ఇండియ‌న్ ఫుట్‌బాల్ లెజండ్ మైదాన్ ఫైన‌ల్ ట్రైల‌ర్‌ వచ్చేసింది

డీవీ

మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (18:27 IST)
Ajay Devgn
ఏడాదికి క‌నీసం ఒక్క హిట్ అయినా లేకుండా ఆయ‌న కెరీర్ గ‌డ‌వ‌లేదు. సినిమా హీరోల్లో ఈ అరుదైన ఘ‌న‌త ఉన్న హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌. ఆయ‌న పుట్టిన‌రోజు ఇవాళ‌. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మైదాన్ సెన్సేష‌న‌ల్ ఫైన‌ల్ ట్రైల‌ర్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఒక‌టా, రెండా ఎన్నెన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న లెజండ‌రీ కోచ్ ఎస్‌.అబ్దుల్ ర‌హీమ్‌, ఆయ‌న ఇండియ‌న్ ఫుట్‌బాల్ టీమ్ గురించి ఈ ట్రైల‌ర్ మ‌రింత అద్భుతంగా ఆవిష్క‌రించింది.

ఫుట్‌బాల్ రంగంలో మ‌న ఇండియా టీమ్... చ‌రిత్ర‌ను ఎలా తిరగ‌రాసిందో చెప్పే చిత్ర‌మే మైదాన్‌.
ప్ర‌తి ఒక్క‌రూ అనుస‌రించాల్సిన అంకిత భావం, అచంచ‌ల‌మైన విశ్వాసం, ఫుట్‌బాల్ రంగంలో వెలుగులు చాటాల‌నే త‌ప‌న‌తో ముంద‌డుగేసి, రాణించి మ‌న దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన లెజండ‌రీ కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.
అమిత్ ర‌వీంద్ర‌నాథ్ శ‌ర్మ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆద‌ర్శ‌వంత‌మైన ఈ స్పోర్ట్స్ బ‌యోపిక్‌లో ప్రియ‌మ‌ణి, గ‌జ్‌రాయ్ రావు, బెంగాలీ యాక్ట‌ర్ రుద్ర‌నీల్ ఘోష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
 
జీ స్టూడియోస్‌, బోనీ క‌పూర్‌, అరుణ‌వ జోయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా నిర్మించారు. సైవిన్ ఖుద్రాస్, రితీష్ షా స్క్రీన్ ప్లే, డైలాగులు రాశారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. మ‌నోజ్ ముంత‌షిర్ శుక్లా లిరిక్స్ రాశారు. ఈద్ సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏప్రిల్ 10న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఐమ్యాక్స్ వెర్ష‌న్ కూడా అదే రోజున విడుద‌ల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు