కొత్త హీరో భరత్, సృష్టి ధాంగే జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ఓయ్ నిన్నే" చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకాగా, ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
సత్య చల్లకోటి దర్శకుడు. ఎస్.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను రచయిత కోన వెంకట్ విడుదల చేశారు.
ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. ఆ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.