నీ కోసం ఉద్దేశించినది అయితే అది నీ దగ్గరకు వస్తుందనేది పాత మాట. అది ఈ సినిమాలో నిజం అయింది. మిఠాయి తినాలని రాసిపెట్టివుంటే అది ఎలాగోలా మనల్ని తినేలా చేస్తుంది. ఇందులో పాత్ర కూడా చక్కటి పాత్ర. అంత అద్భుతమైన పాత్ర నన్ను వరించడం మిఠాయి తిన్నంత హాయిగా వుంది అని పేర్కొంది. ట్రైలర్ ఈరోజే విడుదలైంది.
అందులో భర్తను చంపిన భార్యగా చూపించారు. ఇంటరాగేషన్‌లో ఇద్దరిమధ్య మానసిక సంబంధమా, శారీరక సంబంధమా! అని ఎస్.ఐ. అడిగితే, శారీరక సబంధం అంటే సంభోగ్ హోతాహై అంటూ కిస్ సీన్స్ చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత ఇంటికి కోడలుగా వెళితే, అత్తగారు పకోడి వండమంటే నాకు రాదని చెబుతుంది. బయోడేటాలో నువ్వు సర్వ గుణ సంపన్నురాలివి అని రాశారు అని అత్తగారు ప్రశ్నిస్తే, మీ అబ్బాయి 5.11 అంగుళాలు వుంటారని రాశారు. కానీ 5.8 అంగుళాలే వున్నాడంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ఇలా నేటి జనరేషన్‌కు తగినట్లుగా కథ కనిపిస్తుంది.
దీనికి వినైల్మాథ్యూ దర్శకత్వం వహించారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టి-సిరీస్ బ్యానర్‌లో ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో తాప్సీ పన్నూ, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే నటించారు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకానుంది.