ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం, మనతోని కాదురా భై అంటూ సాగే రొమాంటిక్ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. శైలేష్ కొలను విడుదల చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
జీవితం అనేది ఒక యుద్దం.. చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా.. నీ పోరాటం నువ్వే చేయాలి.. ఆ పోరాటంలో నా రామ్ గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది.. గెలుస్తావ్ కదా? అంటూ తండ్రి చెప్పే మాటలతో ట్రైలర్ అద్భుతంగా ఓపెన్ అయింది. ఈ 60 ఏళ్ల స్వాతంత్ర్యం ప్రజలది కాదు.. అధికారులది కాదు.. రాజకీయ నాయుకులది మాత్రమే.. మీరు అప్పుడూ బానిసలే.. ఇప్పుడూ బానిసలే.. ఎప్పుడూ బానిసలే అంటూ శుభలేఖ సుధాకర్ గారు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇలా సినిమాలో దేశ భక్తిని చాటే ఎన్నో డైలాగ్స్ ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. కళ్ళలో త్రివర్ణ పతాకాన్ని చూపించే షాట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ ట్రైలర్‌ని చూస్తున్నంతసేపు సినిమా చూడాలని ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.
కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారన్ సుక్రి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు.