తిరుమల బ్రహ్మోత్సవాలు : గజవాహనంలో శ్రీనివాసుడు

సోమవారం, 24 సెప్టెంబరు 2012 (15:02 IST)
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు ఆరో రోజైన ఆదివారం రాత్రి గజవాహనంపై తిరు వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చాడు. ఆదివారం ఉదయం హనుమంత వాహనంపై విహరించిన శ్రీవేంకటనాథుడు.. రాత్రికి గజవాహనంపై తిరిగాడు.

గజేంద్ర మోక్ష ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరేవారిని కాపాడతానని చాటి చెప్పడే ఈ వాహన ప్రాశస్త్యం. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వేడుకలను లక్షలాది మంది భక్తులు దర్శించి తపించిపోయారు.
File
FILE

వెబ్దునియా పై చదవండి